Share News

శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయం

ABN , Publish Date - Oct 06 , 2025 | 12:17 AM

శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయమని ఎస్పీ సునీల్‌ షెరాన అన్నారు.

శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయం
లారీలను స్వాధీనం చేసుకున్న పోలీసులు

ఎస్పీ సునీల్‌ షెరాన

జిల్లా వ్యాప్తంగా కార్డన సెర్చ్‌

16 బైక్‌లు, రెండు లారీలు స్వాధీనం

30 లీటర్ల నాటుసారా,

20 మద్యం సీసాలు సీజ్‌

నంద్యాల టౌన, అక్టోబరు 5(ఆంధ్ర జ్యోతి): శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయమని ఎస్పీ సునీల్‌ షెరాన అన్నారు. ఇందులో భాగంగానే జిల్లా వ్యాప్తంగా కార్డనసెర్చ్‌ నిర్వహించినట్లు తెలిపారు. ఆదివారం ఎస్పీ మాట్లాడుతూ ప్రజల భద్రతకు భరోసా కల్పించేందుకు గ్రామాల్లో సోదాలు నిర్వహించినట్లు తెలిపారు. సరిమైన పత్రాలు లేని 16 బైక్‌లు, గ్రానైట్‌ను అక్రమంగా తరలిస్తున్న రెండు లారీలను స్వాధీ నం చేసుకున్నామన్నారు. అలాగే 30 లీటర్ల నా టుసారా, 20 మద్యం బాటిళ్లను గుర్తించి సీజ్‌ చేసినట్లు వివరించారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కడైనా నేరం జరగుతున్నట్లు తెలిస్తే స్థానిక పోలీసుస్టేషనకు సమాచారం ఇవ్వాలన్నారు. సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్‌

నంద్యాల జిల్లా వ్యాప్తంగా రౌడీ షీటర్లకు ఆదివారం కౌన్సిలింగ్‌ నిర్వహించామని ఎస్పీ సునీల్‌ షెరాన తెలిపారు. ప్రతి ఒక్కరూ సమాజంలో మంచి పౌరులుగా జీవించాలన్నారు. రౌడీ షీట్‌ ఉన్నవారిపై నిత్యం నిఘా ఉంటుందన్నారు. నేర చరిత్రను వదిలి మంచిగా బతుకాలన్నారు. కార్యక్రమం లో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

జూపాడుబంగ్లా: మండలంలోని తరిగోపుల గ్రామంలో ఆదివారం పోలీసులు కార్డనసెర్చ్‌ నిర్వహించారు. నందికొట్కూరు రూరల్‌ సీఐ సుబ్రమణ్యం, ఎస్‌ఐ మల్లికార్జునతోపాటు పోలీసులు గ్రామంలోని అనుమానితుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. బెల్ట్‌ దుకాణాలపై దా డులు చేశారు. సరస్వతమ్మ అనే మహిళ వద్ద మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.

ఆత్మకూరు: పట్టణంలోని లక్ష్మీనగర్‌లో పోలీసులు కార్డన సెర్చ్‌ నిర్వహించారు. పలువురి అనుమానితులు, నేరచరిత్ర కలిగిన వారి నివాసాల్లో తనిఖీలు చేశారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఆత్మకూరు అర్బన సీఐ రాము మాట్లాడుతూ ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించే ప్రసక్తే ఉండదని స్పష్టం చేశారు.

Updated Date - Oct 06 , 2025 | 12:17 AM