ఆరోగ్యాంధ్రప్రదేశ సాధనే లక్ష్యం
ABN , Publish Date - Dec 21 , 2025 | 12:03 AM
ఆరోగ్యాంధ్రప్రదేశ కూటమి ప్రభుత్వ లక్ష్యమని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి అన్నారు.
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి
ఆత్మకూరురూరల్, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్యాంధ్రప్రదేశ కూటమి ప్రభుత్వ లక్ష్యమని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి అన్నారు. శనివారం పట్టణం లోని జిల్లా పరిషత బాలికల ఉన్నత పాఠ శాలలో ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగం గా పరిసరాలను శుభ్రంగా ఉంచడంతో ఆరో గ్యంతో పాటు, పర్యావరణాన్ని కాపాడుకో వ చ్చని తెలిపారు. పాఠశాలలోని సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో వాటిని సత్వరమే పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ రమే్‌షబాబుకు సూచించారు. ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల క్రికెట్ టీంలో విజేతగా నిలిచిన ఆత్మకూరు టీంకు, ద్వితీయ స్థానం దక్కించుకున్న బండి ఆత్మకూరు టీంలకు ఎమ్మెల్యే జ్ఞాపికలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైౖర్మన మారుఫ్ ఆసియా, కేసీ కెనాల్ చైర్మన బన్నూరు రామలింగారెడ్డి, సింగిల్ విండో చైౖర్మన షహబుద్దీన, ప్రధానోపాధ్యా యురాలు ఉమారాణి, విద్యా కమిటీ చైౖర్మన ఖాజా, ఎంఈవోలు మేరి మార్గరేట్, అయూబ్‌అహ్మద్, వైద్యాధికారులు సాజిదా, జుబేర్, ఎంపీడీవో నాగేంద్రుడు, టీడీపీ మండల అ ధ్యక్షులు రవీంద్రబాబు, నాయకులున్నారు.
పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి
నందికొట్కూరు రూరల్ : పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే జయ సూర్య విద్యార్థులకు, అధికారులకు, ప్రజ ల కు పిలుపునిచ్చారు. శనివారం మండలంలోని వడ్డెమాను గ్రామంలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యమ్రం నిర్వహించారు. విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే ర్యాలీలో పాల్గొన్నారు. అధికారులు, గ్రామస్థులతో కలిసి చీపురు పట్టుకొని గ్రామంలోని రోడ్లను ఊడ్చారు. కారక్రమంలో టీడీపీ నాయకులు మాండ్ర సురేంద్రనాథరెడ్డి, ఎంపీడీవో సుబ్రహ్మణ్యశర్మ, ఎస్సై మణికంఠ, గ్రామ సర్పంచ రామచంద్రుడు, కోనేటమ్మపల్లె సర్పంచ దామోదరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.