Share News

శ్రామికుల సంక్షేమమే ధ్యేయం

ABN , Publish Date - Oct 04 , 2025 | 11:36 PM

శ్రామికుల సంక్షేమమే ఎన్డీఏ ప్రభుత్వ ధ్యేయమని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు.

శ్రామికుల సంక్షేమమే ధ్యేయం
మాట్లాడుతున్న శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి

శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి

ఆత్మకూరు, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): శ్రామికుల సంక్షేమమే ఎన్డీఏ ప్రభుత్వ ధ్యేయమని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు. శనివారం ‘ఆటో డ్రైవర్ల సేవ లో’ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని స్థానిక నంద్యాల టర్నింగ్‌ నుంచి గౌడ్‌సెంటర్‌ వరకు ఆటో డ్రైవర్లతో ర్యాలీ నిర్వహించారు. ఆయనే స్వయంగా ఆటో నడిపి అందరిని ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. గత వైసీపీ హయాంలో వాహన మిత్ర పేరిట ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.10వేల సాయం ఇచ్చి జరిమానాలు, ఇతర వాహన ట్యాక్సీల పేరిట రూ.30 వేల వరకు దోపిడీ చేశారని ఆరోపించారు. అయితే తమ ప్రభుత్వం ఆటో డ్రైవర్లపై ఎలాంటి భారం వేయకుండానే ఏడాదికి రూ.15వేల సాయం చేస్తోందన్నారు. రాబోయే రోజుల్లో మరింత సుపరిపాలన అందిస్తామని స్పష్టం చేశా రు. కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ కన్వీనర్‌ మోమిన షబానా, ఐటీడీఏ పీవో వెంకట శివప్రసాద్‌, ఎంవీఐ సత్యనారాయణరెడ్డి, ఎంపీడీవో నాగేంద్ర, మున్సిపల్‌ కమిషనర్‌ రమే్‌షబాబు, టీడీపీ నాయకులు వేణుగోపాల్‌, రవీంద్రబాబు, శివప్రసాద్‌రెడ్డి, తిరుపమయ్య, నాగూర్‌ఖాన, షాబుద్దిన, అబ్దుల్లాపురం బాషా, నజీర్‌అహ్మద్‌, మల్లికార్జునరెడ్డి, రామ్మూర్తి, జనసేన పార్టీ నాయకులు శ్రీరాములు, అరుణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 04 , 2025 | 11:36 PM