Share News

పేదల సంక్షేమమే లక్ష్యం

ABN , Publish Date - Jul 12 , 2025 | 11:42 PM

పేదల సంక్షేమమే కూటమి ప్రభు త్వ లక్ష్యమని డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి అన్నారు.

 పేదల సంక్షేమమే లక్ష్యం
కొమ్మేమర్రిలో కరపత్రాన్ని అందిస్తున్న ఎమ్మెల్యే కోట్ల

డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి

ప్యాపిలి, జూలై 12 (ఆంధ్రజ్యోతి): పేదల సంక్షేమమే కూటమి ప్రభు త్వ లక్ష్యమని డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని కొమ్మేమర్రి, బూరుగుల, కౌలపల్లి, సీతమ్మతండా గ్రా మాల్లో నిర్వహించిన సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే పలు సంక్షేమ పథకాలు చేపట్టడంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందన్నారు. గత ప్రభుత్వంలో అధోగతి పాలైన రాష్ట్రాన్ని చక్కదిద్దేందుకు సీఎం అహర్నిశలు కష్టపడుతున్నారన్నారు. ఇటువంటి ముఖ్యమంత్రి దొరకడం రాష్ట్ర ప్రజల అదృష్టమన్నారు. అనంతరం గ్రామాల్లో ఇంటింటా తిరిగి కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ, డీసీఎంఎస్‌ చైర్మన వై నాగేశ్వరరావుయాదవ్‌, ప్రభాకర్‌రెడ్డి, వై లక్ష్మీనారాయణయాదవ్‌, ఆర్‌ఈ నాగరాజు, ఖాజాపీర్‌, వెంకటరాముడు, సుదర్శన, శివారెడ్డి, హేమంతరెడ్డి, పురుషోత్తంరెడ్డి, విష్ణువర్ధనరెడ్డి, రమేష్‌, రంగస్వామి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 12 , 2025 | 11:42 PM