జర్నలిస్టుల హక్కులు, సంక్షేమమే లక్ష్యం
ABN , Publish Date - Dec 15 , 2025 | 11:45 PM
జర్నలిస్టుల హక్కులు, సంక్షేమమే లక్ష్యమని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు ఖండే శ్యామ్‌సుందర్‌లాల్, చలం బాబు అన్నారు.
నంద్యాల (హాస్పిటల్), డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): జర్నలిస్టుల హక్కులు, సంక్షేమమే లక్ష్యమని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు ఖండే శ్యామ్‌సుందర్‌లాల్, చలం బాబు అన్నారు. ఏపీ యూడబ్ల్యూజే నంద్యాల పట్టణ కమిటీని రామకృష్ణ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో సోమవారం ఎన్నుకున్నారు. సమావేశంలో జాతీ య కౌన్సిల్ సభ్యులు మద్దిలేటి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నాగేంద్ర, వాసు, సుబ్బయ్య, నంద్యాల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మధుబాబు, ఉస్మానబాష, గౌరవ సలహాదారులు జనార్ధనరెడ్డి, సీనియర్ పాత్రికే యులు శశిశేఖర్‌శర్మ, రమణారెడ్డి పాల్గొన్నారు. వారు మా ట్లాడుతూ నంద్యాల పట్టణంలో జర్నలిస్టుల ఐక్య సంఘం బలోపేతం చేస్తూ వృత్తి గౌరవాన్ని కాపాడే దిశగా కార్యాచరణ చేపట్టనున్నట్లు తెలి పారు. అనంతరం నంద్యాల పట్టణ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎ న్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా కె.మహేష్, గౌరవ సలహాదారులు గా నాగప్రసాద్, ద్వారకనాథ్, అధ్యక్షుడిగా రాజ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి షేక్.మహబూబ్‌బాషా, అదనపు ప్రధాన కార్యదర్శిగా అరుణ్ కుమార్, కోశాధికారిగా మాలిక్‌బాష, శివకుమార్, శ్రీనివాస్, ప్రచార కార్యదర్శులుగా చంద్ర, అబ్రహాం, ఉపాధ్యక్షులుగా ప్రభాకర్, బాలు నాయక్, నూర్‌బాష, మేఘశ్యామ్, సహాయ కార్యదర్శులుగా జయభా రతరెడ్డి, కిరణ్, శేఖర్, ఇమ్రానఖాన, ఎగ్జిక్యూటివ్ సభ్యులను ఎన్నుకున్నారు.