రాజ్యాధికారమే ధ్యేయం
ABN , Publish Date - Oct 11 , 2025 | 11:56 PM
రాష్ట్రం లో బీసీలు రాజ్యాధికారమే ధ్యేయంగా పని చేయాలని సీపీఐ, బీసీ సంఘాల నాయకులు రంగనాయుడు, మంజుల సబ్బరాయుడు డిమాండ్ చేశారు.
నంద్యాల రూరల్, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్రం లో బీసీలు రాజ్యాధికారమే ధ్యేయంగా పని చేయాలని సీపీఐ, బీసీ సంఘాల నాయకులు రంగనాయుడు, మంజుల సబ్బరాయుడు డిమాండ్ చేశారు. శనివారం స్థానిక సీపీఐ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశంలో జనగణనతో పాటు కులగణన జరగాలన్నారు. బీసీ యొక్క ఐక్యత చాటుకోవాలన్నారు. బీసీ కార్పొరేషన ఏర్పాటు చేసి నిధులు కేటాయించకుండా చేయడం మంచిదికాదన్నారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం కేటాయించాలన్నారు. సమావేశంలో బీసీ, సీపీఐ నాయకులు పాల్గొన్నారు.