Share News

సారా రహిత జిల్లాయే లక్ష్యం

ABN , Publish Date - May 22 , 2025 | 11:54 PM

నవోదయం-2.0’లో సారా రహిత జిల్లాగా తీర్చిది ద్దాలన్నదే లక్ష్యమని ఎక్సైజ్‌ సూపరింటెడెంట్‌ (ఈఎస్‌) రవికుమార్‌ తెలిపారు.

   సారా రహిత జిల్లాయే లక్ష్యం

ఎక్సైజ్‌ పోలీసుల ఉక్కుపాదం

392 మంది బైండోవర్‌

250మంది సారా విక్రేతలు అరెస్టు

4198 లీటర్ల సారా, 1365 కేజీల బెల్లం స్వాధీనం

ఎక్సైజ్‌ సూపరింటెడెంట్‌ రవికుమార్‌

నంద్యాల, మే22(ఆంధ్రజ్యోతి): ‘నవోదయం-2.0’లో సారా రహిత జిల్లాగా తీర్చిది ద్దాలన్నదే లక్ష్యమని ఎక్సైజ్‌ సూపరింటెడెంట్‌ (ఈఎస్‌) రవికుమార్‌ తెలిపారు. ఈ మేరకు జిల్లా ఎక్సైజ్‌ పోలీసులు సారాపై ఉక్కుపాదం మోపారు. ఎక్కడిక్కడ సారా తయారీ, సారా విక్రేతలపై ప్రత్యేక ఆయాప్రాంతాల ఎక్సైజ్‌ పోలీసులు ఆకస్మిక దాడులు చేసి కొరడా ఝుళిపించారు. గురువారం ఎక్సైజ్‌ సూపరింటెడెంట్‌ (ఈఎస్‌) రవికుమార్‌ వివరాలు వెల్లడించారు. ఈఏడాది ఫిబ్రవరి 2వ తేదీన నవోదయం 2.0 కార్యక్రమాన్ని ప్రభుత్వం శ్రీకారం చుట్టగా జిల్లావ్యాప్తంగా ఎక్సైజ్‌ పోలీసులను అప్రమత్తం చేశామన్నారు. ఇప్పటివరకు సారాకు వినియోగించే బెల్లం సరఫరా చేసే 392మంది గుర్తించి ఆయా తహసీల్దార్ల వద్ద బైండోవర్‌ చేశారు. 250మంది సారా విక్రేతలను అరెస్ట్‌చేసి 222 కేసులు నమోదు చేయడంతో పాటు 4198 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నామన్నారు. సారా తయారీచేసే బట్టీలపై దాడులుచేసి 53,563 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేయడంతో పాటు 1365 కేజీల బెల్లంను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రతినెల 4వ శనివారం ఆయా సీఐల పరిధిలో మద్యం విముక్తి-వాటి పర్యావసనాలపై కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పి స్తున్నట్లు తెలిపారు. భవిష్యతలో ఎవరైనా సారా తయారుచేసినా, అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - May 22 , 2025 | 11:54 PM