వైభవంగా బృందావన ప్రతిష్ఠ
ABN , Publish Date - Dec 03 , 2025 | 12:35 AM
పట్టణంలోని దొడగట్ట రోడ్డులో నూతనంగా నిర్మించిన రాఘవేంద్రస్వామి మఠంలో మూల వృత్తిక, బృందావన ప్రతిష్ఠ కార్యక్రమాలను మంగళవారం రాత్రి వైభవంగా నిర్వహించారు
కళ్యాణదుర్గం, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని దొడగట్ట రోడ్డులో నూతనంగా నిర్మించిన రాఘవేంద్రస్వామి మఠంలో మూల వృత్తిక, బృందావన ప్రతిష్ఠ కార్యక్రమాలను మంగళవారం రాత్రి వైభవంగా నిర్వహించారు. రాత్రి నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రాలయం రాఘవేంద్రస్వామి ఆలయ పీఠాధిపతులు సుబేంద్రతీర్థ స్వామిని ఊరేగింపుగా మఠం వద్దకు తీసుకెళ్లారు. బుధవారం పెద్దఎత్తు ప్రారంభోత్సవ కార్యక్రమాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.