మువ్వన్నెల జెండా రెపరెపలు
ABN , Publish Date - Aug 15 , 2025 | 11:57 PM
స్వా తంత్య్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం వాడ వా డలా ఘనంగా జరుపుకున్నారు.
జమ్మలమడుగు, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి) : స్వా తంత్య్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం వాడ వా డలా ఘనంగా జరుపుకున్నారు. ఈసంద ర్భంగా జమ్మలమడుగు మున్సిపల్ కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాను ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, మున్సిపల్ ఛైర్‌పర్సన్ శివమ్మ ఎగురవేసి గౌరవవందనం చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ నిజమైన పాలన జరగాలంటే రాజకీయ స్వార్థం లేకుండా ప్రజలకు సేవలందించాలన్నారు. మున్సి పల్ ఛైర్‌పర్సన్ శివమ్మ మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం పోరాడి అమరులైన ప్రతి ఒక్కరిని స్మరించుకోవాలన్నారు. కార్యక్రమంలో కమిషనర్ వెంకటరామిరెడ్డి, కౌన్సిలర్లు ముల్లాజానీ, సింగరయ్య, పోలీసు చంద్ర, కూటమి నాయకులు వంగల నాగేంద్రయాదవ్, నవనీశ్వరరెడ్డి, గుర్రం ప్రతాప్‌రెడ్డి, మహేంద్ర, గౌస్ అహమ్మద్, మెప్మా ఆర్పీలు, పాల్గొన్నారు. జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆర్డీ వో సాయిశ్రీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏవో, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొ న్నారు. జమ్మలమడుగులోని జూనియర్ సివిల్‌జడ్జి కోర్టు ఆవరణలో జూనియర్ సివిల్ జడ్జి ఎస్.భార్గవి జాతీయ జెండాను ఆవిష్కరిం చారు. కార్యక్ర మంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, సెక్రటరి మురళీధర్‌రెడ్డి న్యాయవాదులు పాల్గొన్నారు. అలాగే మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురష్కరించుకుని మండలంలోని దానవులపాడు యేసుక్రీస్తు చర్చి వద్ద ఎస్సీసెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చదిపిరాళ్ల రమేష్‌రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఫాస్టర్లు ప్రభుదాసు, గోనం పాల్గొన్నారు.
అమరుల త్యాగాల ఫలం స్వాతంత్రం
ప్రొద్దుటూరు, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి) : అమ ర వీరుల త్యాగ ఫలం నేటి స్వాతంత్రం అని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి పేర్కొన్నా రు. శుక్రవారం స్ధానిక టీడీపీ కార్యాలయంలో 79 వ స్వాతంత్ర వేడుకలను ఎమ్మెల్యే వరదరా జులరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్బం గా జాతీయ జెండాను ఎగుర వేసి అమర వీరుల కు ఎమ్మెల్యే నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, మాజీ మున్సిప ల్ చైర్మన్లు వీఎస్ ముక్తియార్, ఆసం రఘురా మిరెడ్డి, మాజీ వైస్ చైర్మన జబివుల్లా, టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఈవీ సుధాకర్ రెడ్డి మాజీ అధ్యక్షుడు ఘంటశాల వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీ పీ రాఘవరెడ్డి, కౌన్సిల్లరు పాల్గొన్నారు. కాగా మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ రవిచం ద్రారెడ్డి, ప్రొద్దుటూరు కో ఆపరేటివ్ టౌన బ్యాంకు లో చైర్మన బొగ్గుల సుబ్బారెడ్డి జాతీయ జెండాను ఎగుర వేసి వేడుకలు నిర్వహించారు.
మైదుకూరు రూరల్‌లో : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో భాగంగా శుక్రవారం మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్ స్థానిక రాయ ల్ కూడలి వద్ద ఏర్పాటు చేసిన వంద అడు గుల జాతీయ జెండాను ఆవిష్కరించారు. మం డల తహసీల్దార్, ఎంపీడీవో, మార్కెట్ కమిటీ, మున్సి పల్ కార్యాయాఆలతోపాటు సిండికేట్ బ్యాంకు పా ఠశాలలు, కళాశాలల్లో జెండాను ఆవిష్కరించారు.
బద్వేలులో : స్వాతంత్ర దినోత్సవ వేడుకల సంద ర్భంగా మున్సిపల్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే డాక్టర్ సుధ, మున్సిపల్ చైర్మన రాజగోపాల్‌రెడ్డి, కమి షనర్ నరసింహారెడ్డిలు పాల్గొని జాతీయ జెం డాను ఆవిష్కరించారు. ఆర్డీవో కార్యాలయం ఎదుట కార్యాలయ అధికారులు జాతీయజెండా ను ఎగురవేశారు. ఎస్‌ఆర్‌ఎనబీ డిగ్రీ కళాశాల లో యువనేత రితేష్‌కుమార్‌రెడ్డి, డిగ్రీ కళాశాల ,ప్రిన్సిపాల్ జి వెంకటసుబ్బారెడిలు జాతీయ జెం డాను ఎగురవేశారు. స్థానిక తహశీల్దారు కార్యాల యంలో తహశీల్దారు ఉదయ భాస్కర్ రాజు, అర్బన పోలీసుస్టేషనలో సీఐ రాజగోపాల్ యాద వ్, జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడకలలో మున్సిపల్ కమిషనర్ నరసిం హారెడ్డి, వైస్‌చైర్మన గోపాలస్వామి, సాయిక్రిష్ణ, అధికారులు , ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
కొండాపురంలో: మండలంలో 79 వ స్వాతం త్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిం చారు. గండికోట ప్రాజెక్టుపైన జాతీయజెండాను ఇరిగిషన సిబ్బంది ఎగురవేశారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ గుర్రప్ప జాతీయ జెండాను ఆవిష్కరించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవే టు కార్యాలయాలు, విద్యాసంస్థల్లో జాతీయ జెండా ను ఎగురవేశారు. పంద్రా గస్టును పురస్కరించు కొని మాజీ ఆర్మీ ఉద్యోగి పీర్ల హాజీవలి ఆధ్వ ర్యంలో రక్తదాన, నేత్రదాన శిబిరం నిర్వహించారు. స్థానిక రెడ్‌క్రాస్ సొసైటీ(అనంతపురం) వారి సహకారంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో 52 మంది రక్తదా నం ఇచ్చినట్లు హాజివలి తెలిపారు. అదేవిధంగా 86 నేత్రదానానికి అంగీకరం తెలిపా రన్నారు. ఈ సందర్భంగా అన్నదానం చేశారు. అట్లూరులో: అట్లూరులో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అట్లూరు తహసీల్దారు కార్యాలయంలో తహసీల్దారు సుబ్బ లక్షుమ్మ, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో వెంగమునిరెడ్డి, పోలీసుస్టేషనలో ఎస్‌ఐ రామక్రిష్ణ జెండా ఎగురవేశారు. మండలంలోని అన్ని ప్రభు త్వ, ప్రైవేటు పాఠశాలల్లో జాతీయ జెండాను ఎగురవేశారు.
పోరుమామిళ్లలో: ఎందరో స్వాతంత్య్ర సమర యోధుల త్యాగఫలమే నేడు మనమంతా స్వా తంత్య్ర ఫలాలు అనుభవిస్తున్నామని పోరుమా మిళ్ల మేజరు పంచాయతీ సర్పంచ యనమల సుధాకర్ అన్నారు. శుక్రవారం పోరుమామిళ్లలో ని మేజరు పంచాయతీ కార్యాలయంలో ఆయన జాతీ యజెండాను ఆవిష్కరించి మాట్లాడారు. అనంత రం మహాత్మాగాంఽధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పంచాయ తీ కార్యదర్శి ఓబులేసు, టీడీపీ నాయ కులు కనమర్లపూటి రామసుబ్బారావు, బాషా, ఇమాం హుసేన, లక్ష్మణ్‌రావు, అతికారి రాజా, తోట వెంకట య్య, రమణ, నరసింహులు పాల్గొన్నారు.కాగా వెంగమాంబ హైస్కూలులో పుల్లప్పనాయుడు జాతీయ జెండాను ఎగుర వేశారు. తహసీల్దారు కార్యాలయంలో చంద్రశేఖర్‌రెడ్డి, పోలీసుస్టేషనలో సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ కొండారెడ్డి, రంగసము ద్రంలో పుత్తారవిప్రకాశరెడ్డి జెండా ఎగురవేశారు.
బ్రహ్మంగారిమఠంలో: స్థానిక ఎంపీడీవో కా ర్యా లయంలో ఎంపీపీ వీరనారాయణరెడ్డి, తహసీల్దా రు కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దారు జాన్సన, సొసైటీ కార్యాలయంలో ఛైర్మన సాంబశివారెడ్డి, పోలీసుస్టేషనలో ఎస్‌ఐ శివప్రసాద్, అలాగే పదో తరగతి ఉత్తమమార్కులు సాధించిన విద్యార్థుల కు సర్పంచ లక్ష్దిదేవి మండల టీడీపీ అధ్యక్షు డు చెన్నుపల్లె సుబ్బారెడ్డి, చిలమల నారాయణ చేతులమీదు నగదు అందించారు.