Share News

రైతును ముంచిన మొంథా

ABN , Publish Date - Oct 29 , 2025 | 11:43 PM

నంద్యాల జిల్లాలో మొంథా తుఫాన రైతులను నట్టేట ముంచింది. చేతికొచ్చిన పంటలు నీటమునగడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.

   రైతును ముంచిన  మొంథా
నంద్యాల పట్టణాన్ని నీటముంచిన ఛామకాల్వ

36,948.21 హెక్టార్లలో పంటనష్టం

744 హెక్టార్లలో దెబ్బతిన్న ఉద్యాన పంటలు

ఒక్కరోజులోనే 2,694.6 మి.మీ., వర్షపాతం

అత్యధికంగా శ్రీశైలంలో 269.8 మి.మీ

నంద్యాల ఎడ్యుకేషన, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లాలో మొంథా తుఫాన రైతులను నట్టేట ముంచింది. చేతికొచ్చిన పంటలు నీటమునగడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. కల్లాల్లో ఆరబెట్టిన మొక్కజొన్న మొలకలెత్తడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికొచ్చిన వరిపంట వర్షపు నీరు ముంచెత్తడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జిల్లాలో 24 గంటల పాటు ఏకధాటిగా వర్షం కురవడంతో గతంలో ఎన్నడూ లేనంతగా 2694.6 ఎంఎం వర్షపాతం నమోదు కావడం గమనార్హం. మొంథా తుఫాన ప్రభావం జిల్లాలోని శ్రీశైలం, వెలుగోడు, ఆత్మకూరు, మహానంది, నంద్యాల, బండిఆత్మకూరు, రుద్రవరం, నందికొట్కూరు, ఆళ్లగడ్డ, శిరువెళ్ల, పాములపాడు, పగిడ్యాల, గోస్పాడు మండలాలపై తీవ్ర ప్రభావం చూపింది. పాలేరు పొంగి ప్రవహించడంతో మహానంది మండలం, నంద్యాల పట్టణాన్ని వరదనీరు ముంచెత్తింది. పాలేరు వాగు పట్టణంలోని చామకాల్వలో కలిసి కుందూనదిలో కలుస్తుంది. దీంతో చామకాల్వకు ఇరువైపులా ఉన్న లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. రవాణా సౌకర్యం స్తంభించి పోయింది.

ఫ జిల్లాలో 36,948.21 హెక్టార్లలో పంటనష్టం

నంద్యాల జిల్లాలో మొంథా తుఫాన ధాటికి 36,948.21 హెక్టార్‌లలో పంటనష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక అంచనాలు రూపొందించారు. నంద్యాల మండలంలో 19 గ్రామాలను వరద ముంచెత్తింది. దీంతో 2792 మంది రైతులకు 1960 హెక్టార్‌ల వరి, నాలుగు హెక్టార్ల కంది, 23 హెక్టార్‌ల మినుము, 495 హెక్టార్‌ల మొక్కజొన్న, 100 హెక్టార్ల పొగాకు, 18 హెక్టార్‌ల సోయాబీన మొత్తంగా 2602.8 హెక్టార్‌లలో పంటలకు నష్టం వాటిల్లింది. బండిఆత్మకూరు మండలంలో 15 గ్రామాల్లో 3871 మంది రైతులకు చెందిన 3065 హెక్టార్ల వరి, 73 హెక్టార్లలో మినుము, 117 హెక్టార్లలో మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. గడివేముల మండలంలో 11 గ్రామాల్లో 1561 మంది రైతులకు చెందిన 564 హెక్టార్ల వరి, 36 హెక్టార్ల కంది, 70 హెక్టార్ల మినుము, 50 హెక్ట్టార్ల పత్తి, 224 హెక్ట్టార్లలో మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. పాణ్యం మండలంలో 12 గ్రామాల్లో 1834 మంది రైతులకు చెందిన 1067 హెక్ట్టార్లలో వరి, 26 హెక్టార్లలో కంది, 24 హెక్టార్లలో మినుము, 33 హెక్టార్లలో పత్తి, 140 హెక్టార్లలో మొక్కజొన్న, 173 హెక్ట్టార్లలో పొగాకు పంటలు దెబ్బతిన్నాయి. మహానంది మండలంలో 8 గ్రామాల్లో 1148 రైతులకు చెందిన 1520 హెక్ట్టార్లలో వరి, 38 హెక్టార్‌లలో మొక్కజొన్న పంటలు నీట మునిగాయి. బనగానపల్లె మండలంలో 10 గ్రామాల్లో 3520 రైతులకు చెందిన 800 హెక్ట్టార్లలో కంది. 100 హెక్ట్టార్లలలో మినుము, 1600 హెక్ట్టార్లలో మొక్కజొన్న, 50 హెక్ట్టార్లలో పత్తి పంటలు దెబ్బతిన్నాయి. నందికొట్కూరు మండలంలో ఆరు గ్రామాల్లో 672 మంది రైతులకు చెందిన 16 హెక్ట్టార్లలో పత్తి, 661 హెకార్లలో మొక్కజొన్న, 17 హెక్టార్‌లలో పొగాకు, 40 హెక్టార్‌లలో సోయాబీన పంటలు దెబ్బతిన్నాయి. జూపాడుబంగ్లా మండలంలో 10 గ్రామాల్లో 979 మంది రైతులకు చెందిన 257 హెక్టార్‌ల వరి, 15 హెక్టార్‌ల కంది, 142 హెక్టార్‌ల పత్తి, 854 హెక్టార్‌ల మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లింది. ఆళ్లగడ్డ మండలంలో 20 గ్రామాల్లో 3053 రైతులకు చెందిన 1219 హెక్టార్‌లలో వరి, 108 హెక్టార్‌లలో కంది, 87 హెక్టార్‌లలో పత్తి, 2015 హెక్టార్‌లలో మొక్కజొన్నకు నష్టం వాటిల్లింది. శిరివెళ్ల మండలంలో 12 గ్రామాల్లో 1100 మంది రైతులకు చెందిన 1080 హెక్టార్‌ల వరి, 120 హెక్టార్‌ల మొక్కజొన్న పంటలు నీటమునిగాయి. గోస్పాడు మండలంలో 15 గ్రామాల్లో 1470 మంది రైతులకు చెందిన 1250 హెక్టార్‌లలో వరిపంట నీటమునిగింది. ఆత్మకూరు మండలంలో 12 గ్రామాల్లో 7150 మంది రైతులకు చెందిన 1047 హెక్టార్‌ల వరి, 2753 హెక్టార్‌లలో మొక్కజొన్న, 24 హెక్టార్‌లలో సోయాబీన పంటలు దెబ్బతిన్నాయి. వెలుగోడు మండలంలో రెండు గ్రామాల్లో 232 మంది రైతులకు చెందిన 282 హెక్టార్‌లలో వరి పంట దెబ్బతింది. ఉయ్యాలవాడ మండలంలో 14 గ్రామాల్లో 368 మంది రైతులకు చెందిన 143 హెక్టార్‌లలో వరి, 37 హెక్టార్‌లలో కంది, 44 హెక్టార్‌లలో మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి.

ఫ 744 హెక్టార్‌లలో ఉద్యానపంటలకు నష్టం

జిల్లాలోని మొంథా తుఫాన ధాటికి 744 హెక్టార్‌లలో ఉద్యానపంటలు దెబ్బతిన్నాయి. 803 మంది రైతులకు చెందిన ఉల్లిపంట 443.23 హెక్టార్‌లలో నష్టం వాటిల్లింది. 101 మంది రైతులకు చెందిన 66 హెక్టార్‌లలో బొప్పాయి పంట దెబ్బతింది. 17 మంది రైతులకు చెందిన 10హెక్టార్‌లో టమోటా పంటకు నష్టం వాటిల్లింది. 63 మంది రైతులకు చెందిన 33.7 హెక్టార్‌లలో చామంతి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. 277 మంది రైతులకు చెందిన 186 హెక్టార్‌లలో పచ్చిమిర్చి పంట నీటమునిగి నష్టం వాటిల్లింది.

ఫ జిల్లాలో అత్యధికంగా 2694.6 ఎంఎం వర్షపాతం నమోదు

జిల్లాలో ఒక్కరోజుల్లోనే గతంలో ఎన్నడూ లేనివిధంగా అత్యధికంగా 2694.6 ఎంఎం వర్షపాతం నమోదైంది. శ్రీశైలం 269.8, వెలుగోడు 172.0, ఆత్మకూరు 139.6, మహానంది 133.4, జూపాడుబంగ్లా 124.8, నంద్యాల 122.4, బండిఆత్మకూరు 113.6, రుద్రవరం 106.8, నందికొట్కూరు 103.0, ఆళ్లగడ్డ 98.6, శిరివెల్ల 98.6, పాములపాడు 90.2, పడిగ్యాల 87.6, గోస్పాడు 85.2, ఉయ్యాలవాడ 84.6, గడివేముల 80.8, దొర్నిపాడు 76.4, కోవెలకుంట్ల 75.6, పాణ్యం 72.2, చాగలమర్రి 70.0, మిడ్తూరు 65.2, కొత్తపల్లె 62.0, బనగానపల్లె 54.2, బేతంచర్ల 53.2, సంజామల 49.6, అవుకు 46.2, డోన 33.2, కొలిమిగుండ్ల 23.0, ప్యాపిలి 7.4ఎంఎం వర్షపాతం నమోదైంది.

Updated Date - Oct 29 , 2025 | 11:43 PM