డంప్ యార్డును తొలగించాలి
ABN , Publish Date - Oct 14 , 2025 | 12:13 AM
పట్టణానికి సమీపంలో ఉన్న డంప్ యార్డును తొలగించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యుడు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.
సీపీఎం నాయకుల డిమాండ్
మున్సిపల్ చైర్మన, కమిషనర్‌కు
వినతిపత్రం అందజేత
నందికొట్కూరు, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): పట్టణానికి సమీపంలో ఉన్న డంప్ యార్డును తొలగించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యుడు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. సోమవారం జై కిసాన పార్కులో మున్సిపల్ చైర్మన దాసి సుధాకర్‌రెడ్డి, కమిషనర్ బేబికి 24వ వార్డు కౌన్సిలర్ చాంద్‌బాషా, సీపీఎం, సమీప కాలనీలవాసుల ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ కుమ్మరిపేట, బైరెడ్డి నగర్, జంగాలపేట కాలనీల సమీపంలో ఉన్న డంప్ యార్డు నుంచి దుర్వాసన వెదజల్లుతుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. పిల్లలు, పెద్దలకు అంటువ్యాధులు ప్రబలుతున్నాయన్నారు. ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతుంటే మరోపక్క ఆత్మకూరు నుంచి టిప్పర్ల ద్వారా చెత్తను ఇక్కడకు తెరవేస్తున్నారన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు గోపాలకృష్ణ, కొంగర వెంకటేశ్వర్లు, నాగన్న కాలనీవాసులు ఉన్నారు.