మహానాడు పండుగలో జిల్లా బలం చూపాలి
ABN , Publish Date - May 26 , 2025 | 11:41 PM
టీడీపీ ఆవిర్భావం తరువాత సీమనడి ఒడ్డులో ప్రతిష్టాత్మకంగా తొలిసారి మహానాడు పండుగను కడపలో నిర్వ హిస్తున్నందున కడప జిల్లా సత్తాను చాటాలని ఎమ్మెల్యే రామాంజనేయు లు, నియోజకవర్గ పరిశీలకుడు తుగ్గ లి నాగేంద్ర, నియోజకవర్గ సమన్వయ కర్త రితేష్‌కుమార్‌రెడ్డిలు పేర్కొన్నారు.
బద్వేలుటౌన, మే 26(ఆంధ్రజ్యోతి) : టీడీపీ ఆవిర్భావం తరువాత సీమనడి ఒడ్డులో ప్రతిష్టాత్మకంగా తొలిసారి మహానాడు పండుగను కడపలో నిర్వ హిస్తున్నందున కడప జిల్లా సత్తాను చాటాలని ఎమ్మెల్యే రామాంజనేయు లు, నియోజకవర్గ పరిశీలకుడు తుగ్గ లి నాగేంద్ర, నియోజకవర్గ సమన్వయ కర్త రితేష్‌కుమార్‌రెడ్డిలు పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మహానాడుకు తరలివచ్చేందుకు జన సమీకరణపై పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో వారు చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తలకు పెద్దపీట వేయడంతోపాటు చారిత్రాత్మక నిర్ణయాలకు మహానాడు వేదిక కానుందన్నారు. భారీగా తరలివచ్చే అభిమానులకు, కార్యకర్తలకు, నాయకులకు వారికి తగ్గట్లుగా అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకుడు బొజ్జ రోశన్న, వెంగల్‌రెడ్డి, మిత్తికా యల రమణ, నరసింహానాయుడు, భూపాల్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.