Share News

కొలిక్కివచ్చిన చర్చలు

ABN , Publish Date - May 21 , 2025 | 11:21 PM

పొగాకు కంపెనీల మాయా జాలంతో రైతులు మరోసారి నష్టపోయారని, ఈ ఏడాది పొగాకు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ‘కొనేవారేరీ.?’ అనే కథనానికి అధికా రులు స్పందించారు.

   కొలిక్కివచ్చిన చర్చలు
పొగాకు కంపెనీల ప్రతినిధులు, రైతులతో చర్చిస్తున్న డీఏవో మురళీకృష్ణ

పొగాకు రైతుల సమస్య పరిష్కారం

జూన 10లోపు మొత్తం కొంటామని కంపెనీలు హామీ

నేటి నుంచే కొనుగోళ్లు ప్రారంభం

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌

నంద్యాల ఎడ్యుకేషన, మే 21 (ఆంధ్రజ్యోతి): పొగాకు కంపెనీల మాయా జాలంతో రైతులు మరోసారి నష్టపోయారని, ఈ ఏడాది పొగాకు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ‘కొనేవారేరీ.?’ అనే కథనానికి అధికా రులు స్పందించారు. ఈకథనంతో కలెక్టర్‌ రాజకుమారి గనియా కంపెనీల ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో కంపెనీ ప్రతినిధులు దిగివ చ్చారు. జిల్లా వ్యవసాయాధికారి మురళీకృష్ణ చొరవతో రెండు దఫాలుగా రైతులతో, రైతుసంఘాల నాయ కులతో, పొగాకంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపారు. బుధవారం సాయంత్రం వరకు జరిగిన చర్చలు కొలి క్కివచ్చాయి. జిల్లాలో తాము హామీపత్రం ఇచ్చిన పొగాకు అంతటిని జూన 10వ తేదీలోపు కొనుగోలు చేస్త్తామని, నేటి నుంచే కొనుగోళ్లు రైతులకు దగ్గరలోని మండల కేంద్రాల్లో ప్రారంభిస్తామని, ధర కూడా నాణ్యతను బట్టి రూ.12,500 తక్కువ కాకుండా రూ.18,000 వరకు కొనుగోలు చేస్తామని కంపెనీల ప్రతినిధులు డీఏవోకు హామీనిచ్చారు. దీంతో రైతులు, రైతుసంఘాల నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు.

రైతులకు అండగా ఉంటారని ఆశిస్తున్నాం

పొగాకు రైతుల బాధను కళ్లారా చూసిన కలెక్టర్‌ రాజకుమారి తక్షణమే స్పందించారు. పొగాకు కంపెనీల ప్రతినిధులతో మాట్లాడడం, డీఏవో మురళీకృష్ణ చూపిన చొరవతో సమస్య పరిష్కారమైనందుకు వారిద్దరికీ కృతజ్ఞతలు. రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటారని ఆశిస్తున్నాం

- రాజశేఖర్‌, ఏపీ రైతుసంఘం జిల్లా ప్రధానకార్యదర్శి

సంతోషంగా ఉంది..

తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన వెంటనే కంపెనీలతో చర్చలు జరుపడం సంతోషంగా ఉంది. రెండున్నర ఎకరాల్లో పొగాకు వేశా. కంపెనీలు స్పందించకపోవడంతో పొగాకు ఇండ్లలో పెట్టుకోలేక ఇబ్బం దులు పడుతున్నాం.

- సుబ్బారెడ్డి, పొగాకు రైతు, పాములపాడు

వెంటనే కొనుగోలు చేసేలా..

జిల్లాలో వివిధ కంపెనీలతో అగ్రిమెంట్‌ అయిన పొగాకు నిల్వలు చాలా ఉన్నాయి. కలెక్టర్‌ ఆదేశాల మేరకు వెంటనే కంపెనీ ప్రతినిధులపై తక్షణ చర్యలకు ఉపక్రమించడంతో వారు చర్చలకు వచ్చారు. జూన 10వ తేదీలోపు పొగాకు మొత్తాన్ని కొనుగోలు చేసేలా పర్యవేక్షిస్తాం.

- మురళీకృష్ణ, జిల్లా వ్యవసాయాధికారి, నంద్యాల

Updated Date - May 21 , 2025 | 11:21 PM