Share News

దేశం రాహుల్‌ నాయకత్వాన్ని కోరుతుంది

ABN , Publish Date - Oct 09 , 2025 | 11:43 PM

దేశ ప్రజలు రాహుల్‌ గాంధీ నాయకత్వాన్ని కోరుతున్నారని ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర వ్యవహరాల ఇనచార్జి గణేష్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు.

దేశం రాహుల్‌ నాయకత్వాన్ని కోరుతుంది
సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ

కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇనచార్జి గణేష్‌

కర్నూలు అర్బన్‌ , అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): దేశ ప్రజలు రాహుల్‌ గాంధీ నాయకత్వాన్ని కోరుతున్నారని ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర వ్యవహరాల ఇనచార్జి గణేష్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు. గురువారం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏఐసీసీ సభ్యుడు జే.లక్ష్మీనరసింహ అధ్యక్షతన డీసీసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గణేష్‌ కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ దేశంలో ప్రజా వ్యతిరేక పాలన సాగుతోందన్నారు. 11 సంవత్సరాల బీజేపీ పాలనతో దేశ ప్రజలు జీఎస్టీ పేరుతో పన్నుల భారంతో విసిగిపోయారని తెలిపారు. బీహార్‌ ఎన్నికల్లో జీఎస్టీ అంశం తెరపైకి తెచ్చి మరోసారి ఓట్లు దండుకునేందుకు ప్రజలను ప్రధాని మోదీ మభ్యపెడుతున్నారని ఆరోపించారు. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మస్తాన్‌ వలి మాట్లాడుతూ బీజేపీ ఓట్ల దొంగతనం బయటకు తీసిన రాహుల్‌ గాంధీకి మద్దతుగా సంతకాల సేకరణ చేపడుతున్నామన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ ఎం.సుధాకర్‌ బాబు, మాజీ డీసీసీ కె.బాబురావు, నియోజకవర్గాల ఇనచార్జి ఎం.ఖాసీం, అనంతరత్నం మాదిగ, రమేష్‌ యాదవ్‌, దేవిశెట్టి ప్రకాష్‌, యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు బి.మహేంద్ర నాయుడు, వై.మారుతి రావు, షేక్‌ ఖాజా హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 09 , 2025 | 11:44 PM