నియోజకవర్గాన్ని దేశంలోనే నెంబర్-1 చేస్తా
ABN , Publish Date - Jun 11 , 2025 | 11:47 PM
జమ్మలమడుగు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ దేశంలోనే నెం.1 స్థానంలో తీసుకొస్తానని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు.
జమ్మలమడుగు, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): జమ్మలమడుగు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ దేశంలోనే నెం.1 స్థానంలో తీసుకొస్తానని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు. బుధవారం జమ్మలమడుగులోని ముద్దనూరు రోడ్డులో నానుబాల యల్లప్ప ఫంక్షన్ హాలులో స్వర్ణాంధ్ర 2047ను పనుల ప్రారంభోత్సవం, పనుల శంకుస్థాపనలు కార్యక్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పాలన కార్యక్రమంలో భాగంగా జిల్లాస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ పరిపాలన జరుగుతోందన్నారు. దేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళుతోందన్నారు. ముందుగా ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఆర్డీవో సాయిశ్రీ, ఇతర శాఖల అధికారులు అభివృద్ధి పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో మార్కెట్‌యార్డు ఛైర్మన్ సింగంరెడి ్డ నాగేశ్వరరెడ్డి, కౌన్సిలర్ బాణా శివరామలింగారెడ్డి, లావనూరు నారాయణరెడ్డి, వంగల నాగేంద్రయాదవ్, డీఎస్పీ వెంకటేశ్వరరావు, తహసీల్దారు శ్రీనివాసరెడ్డి, కూటమి నాయకుడు గోనా పురుషోత్తంరెడ్డి పాల్గొన్నారు.