పంతులొచ్చారు..!
ABN , Publish Date - Oct 23 , 2025 | 11:21 PM
కొత్తపల్లి మండలం కృష్ణానది ఒడ్డున ఉన్న జానాలగూడెంలో కొంత కాలంగా ఉపాధ్యాయుడు లేక మూతపడిన ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాలకు ఎట్టకేలకు ఐటీడీఏ అధికారులు ఉపాధ్యాయుడిని నియమించారు.
తల్లిదండ్రుల హర్షం
కొత్తపల్లి, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): కొత్తపల్లి మండలం కృష్ణానది ఒడ్డున ఉన్న జానాలగూడెంలో కొంత కాలంగా ఉపాధ్యాయుడు లేక మూతపడిన ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాలకు ఎట్టకేలకు ఐటీడీఏ అధికారులు ఉపాధ్యాయుడిని నియమించారు. ఈ నెల 22న గూడెంలో ‘బడికి తాళం’ అనే శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. ఇందుకు ఐటీడీఏ ఉన్నతాధికారులు స్పందించారు. గురువారం ఆ పాఠశాలకు ఆత్మకూరు మండలం నాగలూటి గూడెంలోని గిరిజన పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న శివాజీని ఉపాధ్యాయుడిగా నియమించారు. అతను గూడెంలో అడవిబాటలో ఉన్న విద్యార్థులను బడిబాట పట్టించారు. ఉపాధ్యాయుడు రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ ‘ఆంధ్రజ్యోతి’కి కృతజ్ఞతలు తెలిపారు.