Share News

గ్రామీణాభివృద్ధే కూటమి ధ్యేయం

ABN , Publish Date - Dec 19 , 2025 | 11:55 PM

గ్రామీణాభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు.

 గ్రామీణాభివృద్ధే కూటమి ధ్యేయం
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే జయసూర్య

ఎమ్మెల్యే జయసూర్య

పీజీఆర్‌ఎ్‌సలో

అధికారులపై ఆగ్రహం

నందికొట్కూరు రూరల్‌, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): గ్రామీణాభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు. శుక్రవారం నందికొట్కూరు మండలంలోని అల్లూరులో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా కార్యకర్తలను నాయకులనుద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో ఏమైనా సమస్యలుంటే తనదృష్టికి తీసుకుని వచ్చి పరష్కరించుకోవాలని సూచించారు. గ్రామాలలో సీసీరోడ్లు, డ్రైన్లు, కల్వర్టులు మన ప్రభుత్వంలోనే ఎక్కువగా నిర్మించామని ఆవిషయం ప్రజలకు తెలిసేలా మసులుకోవాలన్నారు. స్మార్ట్‌ రేషనకార్డుల జారీ విషయంలో అర్హులందరికీ అందేలా చూడాలన్నారు. రైతులకు ఏమైనా సమ స్యలులుంటే వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో నంద్యాల పార్లమెంట్‌ టీడీపీ ఇనచార్జ్‌ మాండ్ర శివానందరెడ్డి, మార్కెట్‌ యార్డ్‌ చైర్మన ప్రసాదరెడ్డి, బ్రాహ్మణకొట్కూరు సొసైటీ సింగిల్‌విండో చైర్మన మద్దూరు హరి సర్వోత్తమరెడ్డి, టీడీపీ కన్వీనర్‌ మాండ్ర సురేంద్రనాథరెడ్డి పాల్గొన్నారు.

అధికారులు పనితీరు మార్చుకోవాలి

గ్రామ స్థాయిలో అధికారులు తమ పనితీరు మార్చుకోవాలని ఎమ్మెల్యే జయసూర్య మండిపడ్డారు. శుక్రవారం నందికొట్కూరు ఎంపీడీవో కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే హాజరు కాగా వివిధ గ్రామాల నుం చి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి వినతిపత్రాలు అందజేశారు. గ్రామ కార్యదర్శులు, వీఆర్వోలను, ఇతరశాఖల అధికారులను ఆయా సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గృహనిర్మాణంకోసం పొజిషన సర్టిఫి కెట్‌ జారీ చేయడంలేదని ఎక్కువ మంది ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వచ్చారు. దీనిపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. అర్హత వున్నవారిని గుర్తించి వారికి సమస్య లేకుండా సర్టిఫికెట్స్‌ జారీచేయాలని ఆదేశించారు. ఎంపీడీవో సుబ్రహ్మణ్యశర్మ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Dec 19 , 2025 | 11:55 PM