మహిళల సహకారంతోనే కూటమికి అధికారం
ABN , Publish Date - Sep 06 , 2025 | 12:23 AM
వైసీపీ అరాచక పాలనను తరిమి కొట్టి కూటమిని అధికారంలోకి తేవడం లో మహిళల పాత్ర కీలకమైనదని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి పేర్కొన్నారు.
ఇచ్చిన హామీలు అమలు చేయడం చంద్రబాబుకే సాధ్యం
స్త్రీ శక్తి సమావేశంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి
ప్రొద్దుటూరు, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యో తి) : వైసీపీ అరాచక పాలనను తరిమి కొట్టి కూటమిని అధికారంలోకి తేవడం లో మహిళల పాత్ర కీలకమైనదని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం స్దానిక అభ్యాస్ జూనియర్ కాలేజీ ఆవరణలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన సూపర్‌సిక్స్ పథకాలు అన్ని సక్సెస్ అయిన సందర్బంగా సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇచ్చిన హామీలను అమలు చేయడం చంద్రబాబుకే సాధ్యమ న్నారు. ఆయన సంక్షేమంతో పాటు అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర గా మార్చగలడన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొండారెడ్డి మాట్లాడుతూ పింఛన్లను ఒకే సారి రూ 4వేలు పెంచి వృద్ధులకు, దివ్యాంగులకు వితంతువులను ఆదుకుంటున్నాడ న్నారు. ఉచితంగా మూడు సిలిండర్లు అందిస్తున్నారన్నారు. స్కూలు తెరవంగానే ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికి తల్లికి వందనం అందజేస్తున్నాడన్నారు, అసాధ్యమనుకున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సాధ్యమం చేసి చూపారన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, మాజీ మున్సిపల్ చైర్మన వీఎస్ ముక్తియార్, మాజీ ఎంపీపీ రాఘవరెడ్డి, టౌన బ్యాంకు చైర్మన సుబ్బారెడ్డి, వాల్మీకి బోయ కార్పొరేషన డైరె క్టర్ నల్లబోతుల నాగరాజు, మున్సిపల్ కౌన్సిల్లర్లు వంగనూరు మురళీధర్‌రెడ్డి , గాజుల జ్యోతి, జంబాపురం వెంకటలక్ష్మీ, మాజీ కౌన్సిలరు నూర్జహాన, టీడీపీ మహిళా నేతలు బోగా శివకళ్యాణి ,లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.