Share News

జ్యోతి క్షేత్రంలో ‘థ్యాంక్‌ యూ మంత్రి నారాలోకేశ’ కార్యక్రమం

ABN , Publish Date - Mar 16 , 2025 | 11:31 PM

కాశి నాయన ఆశ్రమంలో ఆదివారం రాష్ర ప్రభుత్వ ప్రతినిధి కేకే ఛౌదరి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు కాశినాయన భక్తులు కలిసి థ్యాంక్‌యూ మంత్రి నారాలోకేశ కార్యక్రమం నిర్వహించారు.

జ్యోతి క్షేత్రంలో ‘థ్యాంక్‌ యూ మంత్రి నారాలోకేశ’ కార్యక్రమం
‘థ్యాంక్‌ యూ మంత్రి నారాలోకేశ’ కార్యక్రమం

కాశినాయన మార్చి16(ఆంధ్రజ్యోతి): కాశి నాయన ఆశ్రమంలో ఆదివారం రాష్ర ప్రభుత్వ ప్రతినిధి కేకే ఛౌదరి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు కాశినాయన భక్తులు కలిసి థ్యాంక్‌యూ మంత్రి నారాలోకేశ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి నారా లోకేశకు నూతన నిర్మాణాల వద్ద నిలబడి బ్యానర్‌లు చేతబట్టి థ్యాంక్‌యూ సార్‌ అంటూ హర్షం వ్యక్తంచేస్తూ ఎల్లవేళలా రుణపడి ఉంటామన్నారు.ఈకార్యక్రమంలో టీడీపీ మండల బాధ్యుడు రాజారెడ్డి, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు గురివిరెడ్డి, నాయకుడు హోండా రవీంద్రారెడ్డ్డి, ఎంపీటీసీ రమణ, పోలిరెడ్డ్డి, నరసింహారెడ్డ్డి, క్రిష్ణారెడ్డ్డి, జయరామిరెడ్డ్డి, పిరవీద్రారెడ్డ్డి, రమణారెడ్డి, రోహిత రెడ్డి, ప్రదాన అర్ఛకుడు జీరయ్యస్వామి పలువురు కాశినాయన భక్తులు పాల్గొన్నారు.

Updated Date - Mar 16 , 2025 | 11:31 PM