Minister Satya Kumar: నేటి నుంచి టెట్ పరీక్షలు
ABN , Publish Date - Dec 10 , 2025 | 04:36 AM
ప్రజారోగ్య రంగంలో ఏడాదిన్నరలోనే కొంత మార్పు తీసుకురాగలిగామని, కానీ.. చేయాల్సింది ఇంకా ఉందని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 133 కేంద్రాల ఏర్పాటు
2.71 లక్షల మందికి పైగా అభ్యర్థులు
రాష్ట్రానికి 8 మంది కొత్త ఐఏఎస్‌లు
కేటాయించిన కేంద్ర ప్రభుత్వం
అమరావతి, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ప్రజారోగ్య రంగంలో ఏడాదిన్నరలోనే కొంత మార్పు తీసుకురాగలిగామని, కానీ.. చేయాల్సింది ఇంకా ఉందని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో ఆరోగ్యశాఖ విభాగాధిపతులతో మంగళవారం ఆయన 3 గంటల పాటు సమీక్ష నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు పూర్తయిన సందర్భంగా ఆరోగ్యశాఖ పనితీరు, ఫలితాలను సమీక్షించారు. వైద్యులు, ఇతర సిబ్బంది బాధ్యతతో, జవాబుదారీతనంతో ప్రజలకు నాణ్యమైన సేవలందించాలని కోరారు. దీనికి విభాగాధిపతులే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ఇటీవల కొందరు ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్య ధోరణిపై వచ్చిన వార్తల పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆపరేషన్లు చేసి బ్లేడ్లు దేహాల్లోనే వదిలేయడం, రోగులకు సరిపడని ఇంజక్షన్లు ఇవ్వడం, గంటల తరబడి వారిని పట్టించుకోకపోవడం, రోగుల పట్ల దురుసుగా ప్రవర్తించడం వంటి ధోరణిని ఏమాత్రం ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇలాంటి నిర్లక్ష్య ధోరణితో ప్రభుత్వాస్పత్రులపై ప్రజల విశ్వాసం సన్నగిల్లుతుందని, ఇవి పునరావృతం కాకూడదని హెచ్చరించారు. డీఎంహెచ్‌వోలు, డీసీహెచ్‌ఎస్‌ల పనితీరును మంత్రి ఆక్షేపించారు. తమ బాధ్యతల పట్ల అవగాహన లేనట్లు వ్యవహరిస్తున్నారని, దీనికి అడ్డుకట్ట వేయాలని డీహెచ్‌ను ఆదేశించారు. జీజీహెచ్‌ల సూపరింటెండెంట్లు, అడ్మినిస్ట్రేటర్ల మధ్య సమన్వయ లోపం ఉండకూడదన్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న స్క్రబ్ టైఫస్ కేసుల గురించీ మంత్రి ఆరా తీశారు. స్క్రబ్ టైఫ్ నివారణ, చికిత్స పద్ధతులపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు.