AP Govt: టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ సాయికి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం
ABN , Publish Date - Dec 10 , 2025 | 05:00 AM
అర్జున అవార్డు గ్రహీత, టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ సాయి మైనేనికి రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ కలె క్టర్‌గా ఉద్యోగం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
అమరావతి, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): అర్జున అవార్డు గ్రహీత, టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ సాయి మైనేనికి రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ కలె క్టర్‌గా ఉద్యోగం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. క్రీడల కోటాలో డైరెక్ట్ రిక్రూటీ డిప్యూటీ కలెక్టర్‌గా ఆయన్ను నియమించారు. నియామక ఉత్తర్వు జారీ చేసిన నేపథ్యంలో 30 రోజుల్లోగా భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) ముందు హాజరై సర్టిఫికెట్లు సమర్పించి రిపోర్టు చేయాల్సిందిగా రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. సాకే త్ సాయి టెన్నిస్‌లో పలు మెడల్స్ సాధించారు. ఆసియన్ గేమ్స్‌లో ఆయన బంగారు, వెండి పతకాలు సాధించారు. కేంద్రం 2017లో ఆయన్ను ప్రతిష్టాత్మక అర్జున అవార్డుతో సత్కరించింది. సాకేత్ సాయికి క్రీడల కోటాలో డైరెక్ట్ రిక్రూటీ డిప్యూటీ కలెక్టర్ (రెండో కేటగిరీ) ఇవ్వాలని యువజన సర్వీసుల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించింది. ఈ ఏడాది జూలై 24న రాష్ట్ర మంత్రివర్గం ఆ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.