అప్పులబాధతో కౌలు రైతు ఆత్మహత్య
ABN , Publish Date - Oct 12 , 2025 | 12:08 AM
మండలంలోని గోరంట్లలో అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నారు.
కోడుమూరు రూరల్, అక్టోబరు 11, (ఆంధ్రజ్యోతి): మండలంలోని గోరంట్లలో అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలివీ.. గ్రామానికి చెందిన గుమ్మిశెట్టి శేఖర్ (50) మూడేళ్ల నుంచి 6 ఎకరాలు కౌలు తీసుకుని పంటలు సాగుచేస్తున్నారు. ఉల్లి, పత్తి వంటి పంటల సాగులో తీవ్రనష్టాలు చవిచూశారు. పంటలసాగులో కౌలు, పెట్టుబడుల కోసం చేసిన అప్పులు రూ. 10 లక్షలు పెరిగిపోయాయి. దీంతో జీవితంపై విరక్తిచెంది శుక్రవారం గ్రామశివారులో పురుగుమందు తాగారు. అటుగా వస్తున్న కొందరు గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కోడుమూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హుటాహుటిన అక్కడి నుంచి కర్నూలు ప్రభుత్వాసుత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందారు. శేఖర్‌కు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.