Share News

పక్కాగా దేవదాయం

ABN , Publish Date - Mar 13 , 2025 | 12:34 AM

దేవ దాయశాఖలో వరుస సంస్కరణలతో ఇక దేవాలయంపై వచ్చే ఆదాయం లెక్కలు పక్కాగా తేలనున్నాయి. ఇప్పటికే ఓ పక్క దేవాలయాల పునర్విభజన జరుగుతుండగా, మరోవైపు ఆదా యాలు పక్కదారి పట్టకుండా ఉండేందుకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై ఆలయ కార్యనిర్వహణాధి కారితో పాటు ఆలయ ఆదాయ పరిమితి మేరకు ఇతర అఽధికారులకు జాయింట్‌ చెక్‌ పవర్‌ ఇచ్చారు.

పక్కాగా దేవదాయం

ఎఫ్‌డీఆర్‌లపై జాయింట్‌ చెక్‌పవర్‌

ఈవోలకు దేవదాయశాఖ కమిషనర్‌ షాక్‌

సంవత్సరాంతంలోను ఎఫ్‌డీఆర్‌లపై తనిఖీలు

మార్చి 31లోగా ప్రక్రియ పూర్తికి ఆదేశాలు

ఏలూరు, మార్చి 12 (ఆంధ్రజ్యోతి) : దేవ దాయశాఖలో వరుస సంస్కరణలతో ఇక దేవాలయంపై వచ్చే ఆదాయం లెక్కలు పక్కాగా తేలనున్నాయి. ఇప్పటికే ఓ పక్క దేవాలయాల పునర్విభజన జరుగుతుండగా, మరోవైపు ఆదా యాలు పక్కదారి పట్టకుండా ఉండేందుకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై ఆలయ కార్యనిర్వహణాధి కారితో పాటు ఆలయ ఆదాయ పరిమితి మేరకు ఇతర అఽధికారులకు జాయింట్‌ చెక్‌ పవర్‌ ఇచ్చారు. ఈ మేరకు దేవాదాయశాఖ కమిషనర్‌ సి.రామచంద్రమోహన్‌ ఇటీవల సర్క్యులర్‌ జారీ చేశారు. ఆలయాల్లో ఈవోలు గుడికి వచ్చే పలు ఆదాయాలను ఇష్టారాజ్యంగా ఖర్చు చేసేస్తూ తప్పుడు లెక్కలతో ఆ సొమ్మును తమ సొంత ఖాతాల్లో వేసుకుంటున్నారన్న ఆరోపణలు న్నాయి. ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల (ఎఫ్‌డీఆర్‌)ల్లో సైతం చేతివాటం ప్రదర్శిస్తున్నారని ఆ శాఖ ఉన్నతాధి కారులు గుర్తించారు. ఇలాంటి ఆర్థిక అవతకల కు, గుడుల మనుగడకు విఘాతం కలిగిస్తున్న ట్టు గుర్తించిన కమిషనర్‌ ఈవోతో పాటు ఆల య పరిమితి ప్రకారం పరిధిలోకి వచ్చే అసిస్టెంట్‌ కమిషనర్‌, డిప్యూ టీ కమిషనర్‌, ఆర్‌జేసీల సంతకం తోనే ఆలయాల జమలు, ఖర్చులు సరిచూడాలని నిర్దేశించారు. ఆ తర్వాత ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల రూపంలో మిగిలిన మొత్తాలను ప్రభు త్వ గుర్తింపు బ్యాంకుల్లో ఇద్దరి పర్యవేక్షణలో సంతకాలతో డిపాజిట్లు చేయాలని పేర్కొ న్నారు. పదేళ్లకు మించి తక్కువ వడ్డీ వచ్చే బ్యాంకుల నుంచి ఆయా మొత్తాలను తీసేసి వడ్డీ ఎక్కువ ఇచ్చే బ్యాంకుల్లో కొత్తగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లగా మార్చాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ ప్రక్రియను మార్చి 31లోగా పూర్తి చేసి, ఆయా ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల నమోదు బాండ్లను సైతం అయా జిల్లాల అసిస్టెంట్‌ కమిషనర్‌గా అవి సమర్పించాల్సి ఉంటుంది. జిల్లాలో 716 దేవాలయాలు, సత్రాలుండగా, 200కు పైగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల రూపంలో బ్యాంకుల్లో జమలు జరుగుతున్నాయి. దీంతో ఆర్థిక లావాదేవీల్లో ఈవోల చేతివాటానికి చెక్‌ పడనుంది.

ఉత్తర్వులు పంపాం

జిల్లాలోని అందరి ఈవోలకు దేవదాయశాఖ కమిషనర్‌ ఇచ్చిన ఉత్వర్వులను పంపాం. ఆ మేరకు ఎఫ్‌డీఆర్‌లను వివరాలను సరిచూసి తమ కార్యాలయంలో జమ చేయాలని సూచించాం. ఈ విధానం వల్ల జవాబుదారీతనం, పారదర్శకత పెరుగుతుంది.

– సీహెచ్‌ రంగారావు, జిల్లా దేవదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌

Updated Date - Mar 13 , 2025 | 12:34 AM