Telugu Vignana Samithi: తెలుగు భాష, సంస్కృతులను ప్రోత్సహించండి
ABN , Publish Date - Sep 27 , 2025 | 04:49 AM
తెలుగుభాష, సంస్కృతులను ప్రోత్సహించాలని.., దీనికోసం తెలుగేతర రాష్ట్రాలలో పనిచేస్తున్న సంస్థలకు చేయూతనివ్వాలని ఏపీ సీఎం చంద్రబాబుకు బెంగళూరు కేంద్రంగా...
తెలుగేతర రాష్ట్రాలలో సంస్థలకు చేయూతనివ్వాలి
సీఎం చంద్రబాబుకు తెలుగు విజ్ఞాన సమితి వినతి
బెంగళూరు, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): తెలుగుభాష, సంస్కృతులను ప్రోత్సహించాలని.., దీనికోసం తెలుగేతర రాష్ట్రాలలో పనిచేస్తున్న సంస్థలకు చేయూతనివ్వాలని ఏపీ సీఎం చంద్రబాబుకు బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షులు రాధాకృష్ణరాజు విన్నవించారు. అమరావతిలోని అసెంబ్లీలో ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుతో కలసి ఆయన ముఖ్యమంత్రిని శుక్రవారం కలిశారు. బెంగళూరులో దశాబ్దాలకాలం నుంచి తెలుగు భాష, సంస్కృతి మనుగడ కోసం పలు సంస్థలు పనిచేస్తున్నాయని సీఎం చంద్రబాబుకు వివరించామని ఈసందర్భంగా రాధాకృష్ణరాజు తెలిపారు. గతంలో ఏపీ ప్రభుత్వం సాంస్కృతిక కార్యక్రమాలకు నిధులు మంజూరు చేసేదని, ఐదేళ్లుగా నిలిపివేశారని, వాటిని పునరుద్ధరించాలని చంద్రబాబును కోరినట్టు తెలిపారు. తెలుగు అధ్యయన కేంద్రాన్ని అమరావతికి తరలించడం సంతోషంగా ఉందని, భాష, సాహిత్యంపై మరిన్ని పరిశోధనలు చేసేందుకు అనుకూలత ఏర్పడుతుందని పేర్కొన్నారు.