Telugu Expats: ఒమన్‌లో ప్రవాసుల సహస్ర లింగార్చన
ABN , Publish Date - Nov 03 , 2025 | 06:34 AM
కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఎడారి దేశం ఒమన్‌లోని తెలుగు ప్రవాసులు సహస్ర లింగార్చన చేశారు. రాజధాని మస్కట్‌లో అక్టోబరు 31న...
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)
కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఎడారి దేశం ఒమన్‌లోని తెలుగు ప్రవాసులు సహస్ర లింగార్చన చేశారు. రాజధాని మస్కట్‌లో అక్టోబరు 31న వేద మంత్రోచ్ఛారణల మధ్య ఈ కార్యక్రమం కనులపండువగా సాగింది. వేద పండితులు ధర్మపురి విజయకుమార్ ఆధ్వర్యంలో తయారు చేసిన 1,115 మట్టి లింగాలకు పురోహితులు రుద్రాభిషేకం నిర్వహించారు. ముఖ్య నిర్వాహకులు, చిరు మెగా యూత్ ఫోర్స్ అధ్యక్షుడు చందక రాందాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ ప్రవచనకర్త డాక్టర్ అనంతలక్ష్మి, ఒమన్‌లోని భారత రాయబారి జి.వి. శ్రీనివాస్, సికింద్రాబాద్ మహంకాళీ డివిజన్ ఏసీపీ ఎస్. సైదయ్య తదితరులు పాల్గొన్నారు.