Medical Emergency: పేదింటి బిడ్డకు పెద్ద కష్టం
ABN , Publish Date - Aug 27 , 2025 | 05:12 AM
పేదింటి బిడ్డకు పెద్ద కష్టం వచ్చింది. కూలీ దంపతుల కుమారుడు కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడు. చికిత్సకు రూ.30 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. బ
కూలీ దంపతుల కుమారుడికి కాలేయ వ్యాధి
వైద్యానికి రూ.30 లక్షలు అవసరం
దాతలు సాయం చేయాలని వినతి
బళ్లారి, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి):పేదింటి బిడ్డకు పెద్ద కష్టం వచ్చింది. కూలీ దంపతుల కుమారుడు కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడు. చికిత్సకు రూ.30 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. బళ్లారి జిల్లా కురుగోడు తాలూక హెచ్.విరుపాపుర గ్రామానికి చెందిన రంగస్వామి(17) కుడుగోడులో పీయూసీ చదువుతున్నాడు. ఈ విద్యార్థి తల్లిదండ్రులు నీలమ్మ, సోనస్వామి కూలి పనులు చేస్తారు. రంగస్వామికి కొన్నాళ్ల క్రితం కడుపు ఉబ్బడం, నొప్పి రావడం మొదలైంది. కురుగోడు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే వైద్యులు బళ్లారి విమ్స్‌కు వెళ్లాలని సూచించారు. విమ్స్‌లో పరిశీలించిన వైద్యులు.. బెంగళూరుకు వెళ్లాలని చెప్పారు. బెంగళూరుకు తీసుకెళ్లి చూపిస్తే రంగస్వామికి కాలేయం దెబ్బతిందని, ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని అక్కడి వైద్యులు చెప్పారు. లేదంటే ప్రాణాలకు ప్రమాదం ఉంటుందని తెలిపారు. చికిత్సకు రూ.30 లక్షల దాకా ఖర్చవుతుందని తెలిపారు. చేతిలో చిల్లిగవ్వ లేని ఆ తల్లిదండ్రులు తమ బిడ్డ ప్రాణాలను కాపాడాలని దాతలకు విన్నవిస్తున్నారు. సాయం చేయదలచినవారికి సమాచారం.
పేరు: హెచ్. సన్న సోమ
సిండికేట్ బ్యాంకు ఖాతా నంబరు: 06292210030376
ఐఎఫ్ఎస్‌సీ: సీఎన్‌ఆర్‌వీ0010629
ఫోన్ పే నంబర్: 9019408912