Dual Certification: సాంకేతిక విద్యా బోర్డుకు ఎన్‌సీవీఈటీ గుర్తింపు
ABN , Publish Date - Aug 19 , 2025 | 06:08 AM
రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ బోర్డు(ఎస్‌బీటీఈటీ)కు అరుదైన గుర్తింపు లభించింది. దక్షిణ భారతదేశంలో తొలిసారిగా ఏపీ ఎస్‌బీటీఈటీకి జాతీయ వృత్తి విద్య శిక్షణ మండలి...
అమరావతి, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ బోర్డు(ఎస్‌బీటీఈటీ)కు అరుదైన గుర్తింపు లభించింది. దక్షిణ భారతదేశంలో తొలిసారిగా ఏపీ ఎస్‌బీటీఈటీకి జాతీయ వృత్తి విద్య శిక్షణ మండలి(ఎన్‌సీవీఈటీ) గుర్తింపు లభించింది. దీంతో ఇకపై సాంకేతిక విద్య పరిధిలోని కోర్సులకు రాష్ట్ర బోర్డుతోపాటు, ఎన్‌సీవీఈటీ గుర్తింపుతో కలిపిన డ్యూయల్ సర్టిఫికేషన్ విద్యార్థులకు లభిస్తుంది. ఈ మేరకు ఎన్‌సీవీఈటీతో ఎస్‌బీటీఈటీ అధికారులు సోమవారం ఢిల్లీలో ఒప్పందం చేసుకున్నారు.