అన్నదాతకు కన్నీళ్లే
ABN , Publish Date - Oct 25 , 2025 | 12:18 AM
అల్పపీడన ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మొక్కజొన్న రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
ఆగని వర్షాలు
తడుస్తున్న ధాన్యం
మొలకలు వస్తుండటంతో ఆందోళన
మహానంది/పగిడ్యాల/కొత్తపల్లి, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): అల్పపీడన ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మొక్కజొన్న రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై, కల్లాలలో ఆరబోసుకున్న ధాన్యం తదడవకుండా టార్పా లిన పట్టాలు కప్పిం ఉంచారు. పంటలు చేతికి వచ్చే సమయంలో అకాల వర్షాలు కురువడంతో తీవ్రంగా నష్టపోవాల్సివస్తుందని రైతులు కన్నీళ్లు కారుస్తున్నారు.
మహానంది, పగిడ్యాల, కొత్తపల్లె మండలాల్లో రైతులు విస్తారంగా సాగు చేసిన మెక్కజొన్న పంట తడిసి ముద్దయ్యింది. దీంతో రైతుల కష్టాలు వర్ణణాతీతం. ఈ ఏడాది మెక్కజొన్న పంటకు మంచి డిమాండ్ ఉండటంతో రైతులు ఎకరాకు రూ.25 వేలు ఖర్చు చేసి పంట సాగు చేశారు. కష్టానికి తగ్గ ఫలితం ఉంటుదన్న ఆశతో ఉన్న రైతన్నలకు ప్రకృతి సహకరించకపోవడంతో దిగుబడి ఎకరాకు 20 నుంచి 30 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. పంటను కోసి ప్రధాన రహదారిలో , కల్లాల్లో ఆరుబోసుకున్నారు. కొద్ది రోజులుగా తుఫాన ప్రభావంతో కురుస్తున్న వర్షం ధాన్యం తడవకుండా ఉండటానికి రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కొంతమంది రైతులు టార్పాలిన పట్టాలతో ధాన్యం తడవకుండా కప్పిపెట్టారు. అయితే ఏకధాటిగా కురిసిన వర్షం తో ధాన్యం తడిసి మెలకలు వచ్చాయి. కేంద్ర ప్ర భుత్వం మొక్కజొన్నకు మద్దతు ధర క్వింటా రూ.2,400 నిర్ణయించింది. తడిసిన ధాన్యానికి క్వింటా రూ.1800 ప్రకారమైన కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రావ డం లేదు. దీంతో కౌలు రైతు పరిస్ధితి మ రింత దారుణంగా మారింది. కనీసం మొ క్కజొన్న పంటపై పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్ధితి కూడా కనిపించక పోవడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం తడిసిన మొక్కజొన్న పంట కొనుగోలు చేయడానికి ముందుకు రావాలని రైతాంగం కోరుతున్నారు.