Lavu Srikrishna Devarayalu: టెట్‌పై ఇన్‌సర్వీస్ టీచర్లలో ఆందోళన
ABN , Publish Date - Dec 06 , 2025 | 05:57 AM
ఇన్‌సర్వీస్ టీచర్లు కూడా రెండేళ్ల లోపు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో తప్పనిసరిగా ఉత్తీర్ణత పొందాలన్న...
లోక్‌సభలో టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు
న్యూఢిల్లీ, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): ఇన్‌సర్వీస్ టీచర్లు కూడా రెండేళ్ల లోపు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో తప్పనిసరిగా ఉత్తీర్ణత పొందాలన్న సుప్రీంకోర్టు ఇటీవలి తీర్పుతో దేశంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు లక్ష మందికి పైగా టీచర్లలో ఆందోళన నెలకొందని టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. శుక్రవారం లోక్‌సభలో జీరోఅవర్ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2010కి ముందు నియమితులైన టీచర్ల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఆర్‌టీఈ, ఎన్‌సీటీఈ చట్టాలను సవరించాలని విజ్ఞప్తి చేశారు.