Share News

AP Teachers: ఉపాధ్యాయ సంఘాల హర్షం

ABN , Publish Date - Jun 15 , 2025 | 05:39 AM

తక్కువ సమయంలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు సమర్థవంతంగా నిర్వహించడం పట్ల ప్రాథమిక ఉపాధ్యాయుల సంఘం(ఆప్టా) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏజీఎస్‌ గణపతిరావు, కె.ప్రకాశ్‌రావు హర్షం వ్యక్తంచేశారు.

AP Teachers: ఉపాధ్యాయ సంఘాల హర్షం

అమరావతి, జూన్‌ 14(ఆంధ్రజ్యోతి): తక్కువ సమయంలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు సమర్థవంతంగా నిర్వహించడం పట్ల ప్రాథమిక ఉపాధ్యాయుల సంఘం(ఆప్టా) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏజీఎస్‌ గణపతిరావు, కె.ప్రకాశ్‌రావు హర్షం వ్యక్తంచేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు, ఉన్నతాధికారులకు ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులకు తల్లికి వందనం, స్కూళ్లు, సంక్షేమ హాస్టళ్లలో సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయడంపై తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు మన్నం శ్రీనివాస్‌, మోడల్‌ స్కూల్స్‌ సంఘం అధ్యక్షుడు కె.శివశంకర్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు జోన్ల వారీగా మధ్యాహ్న భోజనం మెనూ అమలు ఏపీలోనే జరుగుతోందన్నారు.

Updated Date - Jun 15 , 2025 | 05:42 AM