Teacher Post Upgradation: గిరిజన శాఖలో టీచర్ పోస్టుల అప్‌గ్రేడేషన్
ABN , Publish Date - Dec 31 , 2025 | 05:49 AM
గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న భాషాపండితులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లను పాఠశాల విద్యాశాఖలో...
అమరావతి, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న భాషాపండితులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లను పాఠశాల విద్యాశాఖలో మాదిరిగానే స్కూల్ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్ చేస్తూ గిరిజన సంక్షేమశాఖ ఉత్తర్వులు జారీచేసింది. తెలుగు భాషా పండితులు 227, హిందీ భాషా పండితులు 91, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ 99 మందితో కలిపి మొత్తం 417 పోస్టులను స్కూల్ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్ చేసింది.