Anakapalli District: కాంక్రీట్ ట్రాలీపడి ఉపాధ్యాయురాలు మృతి
ABN , Publish Date - Nov 22 , 2025 | 05:06 AM
పాఠశాలలో స్టేజీ నిర్మాణ పనులు జరు గుతున్న సమయంలో ప్రమాదవశాత్తూ కాంక్రీట్ ట్రాలీ జారి మీదపడడంతో ఓ ఉపాధ్యాయురాలు మృతి చెందా రు.
పాఠశాలలో స్టేజీ నిర్మాణ సమయంలో ఘటన
పాయకరావుపేట రూరల్, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): పాఠశాలలో స్టేజీ నిర్మాణ పనులు జరు గుతున్న సమయంలో ప్రమాదవశాత్తూ కాంక్రీట్ ట్రాలీ జారి మీదపడడంతో ఓ ఉపాధ్యాయురాలు మృతి చెందా రు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం వెంకటనగరం పంచాయతీ శివారు రాజానగరం జడ్పీ ఉన్నత పాఠశాలలో స్టేజీ నిర్మాణ పనుల్లో భాగంగా శుక్రవారం స్లాబు వేస్తున్నారు. ఆ సమయంలో రిజిస్టర్‌లో సంతకం చేయడానికి స్టాఫ్ రూమ్‌కు వెళుతున్న నెల్లి జోత్స్న బాయ్ (47) అనే ఉపాధ్యాయురాలిపై స్లాబ్ పైనుంచి కాంక్రీట్ ట్రాలీ పడింది. తీవ్ర గాయాలైన ఆమెను సహ ఉపాధ్యాయులు హుటాహుటిన అంబులెన్సులో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. స్లాబు సెంట్రింగ్ కర్ర ఒక్కటి కిందకు దిగబడడంతో కాంక్రీట్ ట్రాలీ జారిపడిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. జ్యోత్స్నభాయ్ ఇంగ్లీషు ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. అంకితభావం కలిగిన టీచర్‌గా ఆమెకు పేరుంది. రెండు సంవత్సరాలు క్రితం ఆమె భర్త గుండెపోటుతో మరణించారు. ఒక కుమారుడు ఇంటర్, మరో కుమారుడు మూడో తరగతి చదువుతున్నారని తోటి ఉపాధ్యాయులు తెలిపారు. ఈ సంఘటన పట్ల రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. స్టేజీ నిర్మాణ కాంట్రాక్టర్, సూపర్‌వైజర్, ట్రాలీ పట్టుకున్న కూలీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ జి.అప్పన్న తెలిపారు.
టీచర్ కుటుంబానికి అండగా ప్రభుత్వం: మంత్రి లోకేశ్
ఉపాధ్యాయురాలు జ్యోత్స్నభాయ్ కుటుంబానికి ప్ర భుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటుందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఈ మేరకు ఆయన ఓ ప్రకటన చేస్తూ ఉపాధ్యాయురాలి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలి పారు. ప్రమాదంపై దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించినట్టు పేర్కొన్నారు. పాఠశాలల ఆవరణలో ఇటువంటి ప్రమాదాలు భవిష్యత్తులో జరగకుండా పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించామని లోకేశ్ పేర్కొన్నారు.