రాష్ట్రస్థాయి సైన్స ఫెయిర్‌కు ఉపాధ్యాయుడు
ABN , Publish Date - Dec 20 , 2025 | 12:00 AM
మం డలంలోని పిన్నాపురం జెడ్పీహైస్కూల్ హెచఎం సుమియోన రాష్ట్రస్థాయి సైన్స ఫెయిర్ పోటీలకు ఎంపికైనట్లు ఎంఈవో కోట య్య తెలిపారు.
పాణ్యం, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి) : మం డలంలోని పిన్నాపురం జెడ్పీహైస్కూల్ హెచఎం సుమియోన రాష్ట్రస్థాయి సైన్స ఫెయిర్ పోటీలకు ఎంపికైనట్లు ఎంఈవో కోట య్య తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మా ట్లాడారు. నంద్యాల ఎస్‌పీజీ హైస్కూల్‌లో జరిగి న జిల్లాస్థాయి సైన్స ఫెయిర్ పోటీలలో ఉపాధ్యాయుల విభాగంలో రాష్ట్రస్థాయి పోటీల కు ఎంపికైనట్లు తెలిపారు. విజయవాడలో ఈనెల23, 24 తేదీలలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో సుమియోన పాల్గొంటారన్నారు. ఈ సందర్భంగా సుమియోనను డీఈవో జనార్దనరెడ్డి, ఎంఈవోలు కోటయ్య, సుబ్రహ్మణ్యం, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు అభినందించారు.