Vemuri Anand Surya: సూపర్ సిక్స్ హిట్‌తో వైసీపీలో వణుకు
ABN , Publish Date - Sep 14 , 2025 | 04:14 AM
సూపర్ సిక్స్ సూపర్ హిట్ కావడంతో వైసీపీలో వణుకుపుడుతోందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేమూరి ఆనంద్ సూర్య అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో...
అమరావతి, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): సూపర్ సిక్స్ సూపర్ హిట్ కావడంతో వైసీపీలో వణుకుపుడుతోందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేమూరి ఆనంద్ సూర్య అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడారు. కూటమి పాలనలో అమలు చేస్తున్న పథకాలతో అన్ని వర్గాల ప్రజలు సంతోషంలో ఉన్నారని, వైసీపీ హయాంలో పథకాల పేరుతో దోపిడీ చేసి, నిధులను తాడేపల్లి ప్యాలె్‌సకు తరలించుకుపోయారని విమర్శించారు. వైసీపీ హయాంలో నిరుద్యోగం 24 శాతానికి చేరి దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో నిలిస్తే, కూటమి పాలనలో అభివృద్ధి, సంక్షేమంలో ఏపీ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉందన్నారు.