మహానాడులో టీడీపీ కార్యకర్తల సత్తా చాటాలి
ABN , Publish Date - May 26 , 2025 | 11:39 PM
కడపలో ఈనెలు 27, 28, 29 తేదీలలో జరిగే టీడీపీ జాతీ య మహానాడు కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు తమ సత్తాచా టాలని ఎమ్మెల్యే నంద్యాల వరద రాజులరెడ్డి పిలుపునిచ్చారు.
ప్రొద్దుటూరు , మే 26 (ఆంధ్రజ్యో తి) : కడపలో ఈనెలు 27, 28, 29 తేదీలలో జరిగే టీడీపీ జాతీ య మహానాడు కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు తమ సత్తాచా టాలని ఎమ్మెల్యే నంద్యాల వరద రాజులరెడ్డి పిలుపునిచ్చారు. సో మవారం స్ధానిక టీడీపీ కార్యాల యంలో ఆయన విలేకరులతో మా ట్లాడుతూ మే 27, 28 తేదీల్లో పార్టీ కార్యకర్తలతో ప్రతినిధుల సమావేశం ఉంటుందన్నారు. అనేక అంశాలపై ముఖ్యంగా ప్రజా సంక్షేమ పధకాలపై తీర్మానాలుంటాయన్నారు. మే 29 న జరిగే మహానాడు బహి రంగ సభను పార్టీ కార్యకర్తతో పాటు ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. కడపలో జరిగే ఈ మహానాడు బహిరంగ సభకు ప్రొద్దుటూరు నుంచి మే 29 ఉదయం 10 గంటలకు వార్డుల వారీగా కార్యకర్తలు తరలిరావడానికి బైపాస్ నుంచి 400 బస్సు లు, 200 కార్లు, 1000 మోటారు బైక్‌ల్లో తరలివెళతామన్నారు. ప్రొద్దుటూరు లో టీడీపీ కి ఇచ్చిన మెజారీటీ మేరకు 25వేలమందిని తరలిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చెర్మన ఆసం రఘురామిరెడ్డి. టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఈవీ సుధా కర్ రెడ్డి, పట్టణ మాజీ అద్యక్షుడు ఘంటశాల వెంకటేశ్వర్లు, పగిడాల దస్తగిరి, వాల్మీకి బోయ కార్పొరేషన డైరెక్టర్ నల్లబోతుల నాగరాజు , టౌన బ్యాంక్ చైర్మన బొగ్గుల సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.