తిరువూరు మున్సిపాల్టీ టీడీపీ కైవసం
ABN , Publish Date - Jun 03 , 2025 | 12:27 AM
తిరువూరు మున్సిపాల్టీని టీడీపీ కైవసం చేసుకుంది. సోమవారం మున్సిపల్ చైర్‌పర్సన్ ఉప ఎన్నిక ప్రశాంత వాతావరణంలో జరిగింది. చైర్‌పర్సన్‌గా టీడీపీ బలపర్చిన 1వ వార్డు కౌన్సిలర్ కొలికపోగు నిర్మల వైసీపీ అభ్యర్థిపై రెండు ఓట్ల తేడాతో గెలుపొందారు.
-మున్సిపల్ చైర్‌పర్సన్‌గా కొలికపోగు నిర్మల ఎన్నిక
-వైసీపీ అభ్యర్థి ప్రసాద్‌పై 2 ఓట్ల తేడాతో గెలుపు
-ఎక్స్ అఫిషియో మెంబర్‌గా ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే కొలికపూడి
తిరువూరు, జూన్ 2(ఆంధ్రజ్యోతి): తిరువూరు మున్సిపాల్టీని టీడీపీ కైవసం చేసుకుంది. సోమవారం మున్సిపల్ చైర్‌పర్సన్ ఉప ఎన్నిక ప్రశాంత వాతావరణంలో జరిగింది. చైర్‌పర్సన్‌గా టీడీపీ బలపర్చిన 1వ వార్డు కౌన్సిలర్ కొలికపోగు నిర్మల వైసీపీ అభ్యర్థిపై రెండు ఓట్ల తేడాతో గెలుపొందారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన చైర్‌పర్సన్ ఉప ఎన్నికల ప్రక్రియలో టీడీపీ బలపర్చిన అభ్యర్థినిగా కొలికపోగు నిర్మల అభ్యర్థిత్వాన్ని 11వ వార్డు కౌన్సిలర్ కాకర్లమూడి సుందరకుమార్ ప్రతిపాదించగా, 14వ వార్డు కౌన్సిలర్ పసుపులేటి శేఖర్‌బాబు బలపర్చారు. వైసీపీ అభ్యర్థిగా మోదుగు ప్రసాద్ అభ్యర్థిత్వాన్ని 10వ వార్డు కౌన్సిలర్ తంగిరాల వెంకటరెడ్డి ప్రతిపాదించగా, 7వ వార్డు కౌన్సిలర్ పరసా శ్రీనివాసరావు (బీరువాల బాబు) బలపర్చారు. ఉప ఎన్నికలకు ఎక్స్ అఫిషియో మెంబర్, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుతో పాటు టీడీపీ మద్దతుదారులు 11 మంది, వైసీపీ మద్దతుదారులు తొమ్మిది మంది హాజరయ్యరు. ఈ ఎన్నికలో నిర్మలకు 11 మంది కౌన్సిలర్లు చెయ్యేత్తి మద్దతు తెలపడంతో ఆమె గెలిచినట్లు ఎన్నికల అధికారిణి, ఆర్డీవో కె.మాధురి ప్రకటించారు. ఆమెతో చైర్‌పర్సన్‌గా ప్రమాణం చేయించారు. ఎన్నికల పరిశీలకుడు, డీఆర్‌వో నరసింహారావు, మున్సిపల్ కమిషనర్ జి.లోవరాజు పాల్గొన్నారు.