Share News

Kadiri Municipal Elections: కదిరి, గాండ్లపెంట పీఠాలు టీడీపీ పరం

ABN , Publish Date - May 20 , 2025 | 06:53 AM

శ్రీసత్యసాయి జిల్లా కదిరి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులు టీడీపీ సొంతం అయ్యాయి. గాండ్లపెంట ఎంపీపీగా టీడీపీకి చెందిన గజ్జెల సోముశేఖర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Kadiri Municipal Elections: కదిరి, గాండ్లపెంట పీఠాలు టీడీపీ పరం

కదిరి, మే 19 (ఆంధ్రజ్యోతి): శ్రీసత్యసాయి జిల్లా కదిరి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్లు, గాండ్లపెంట ఎంపీపీ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. కదిరి మున్సిపల్‌ కౌన్సిల్‌ హాలులో చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక సోమవారం జరిగింది. మొత్తం 36 మంది కౌన్సిలర్లు ఉండగా.. వైసీపీకి చెందిన 11 మంది గైర్హాజరయ్యారు. 25 మంది మద్దతుతో దిల్‌షాదున్నీసా చైర్‌పర్సన్‌గా.. సుధారాణి, రాజశేఖరాచారి వైస్‌ చైర్మన్లుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గాండ్లపెంట ఎంపీపీగా గజ్జెల సోముశేఖర్‌రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మొత్తం ఏడుగురు ఎంపీటీసీల్లో నలుగురు టీడీపీ సభ్యులు హాజరయ్యారు. ముగ్గురు వైసీపీ సభ్యులు రాలేదు. విజేతలను కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ అభినందించారు.

Updated Date - May 20 , 2025 | 06:54 AM