Minister Savitha: వచ్చే ఎన్నికల్లో పులివెందుల టీడీపీదే
ABN , Publish Date - Aug 15 , 2025 | 05:36 AM
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందులలో టీడీపీ జెండా రెపరెపలాడిస్తామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవిత ధీమా..
వైసీపీని బాయ్‌కాట్ చేసిన ఓటర్లు: మంత్రి సవిత
కడప మారుతీనగర్, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందులలో టీడీపీ జెండా రెపరెపలాడిస్తామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవిత ధీమా వ్యక్తం చేశారు. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ విజయబావుటా ఎగురవేయడాన్ని ప్రజాస్వామ్య విజయంగా భావిస్తున్నామన్నారు. గురువారం కడపలో పులివెందుల టీడీపీ ఇన్‌చార్జి బీటెక్ రవి, జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు పుత్తా కృష్ణచైతన్యరెడ్డి, ఆదినారాయణరెడ్డి, జడ్పీటీసీ లతారెడ్డితో కలిసి మంత్రి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ పులివెందుల ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని, రానున్న రోజుల్లో మరింత తీవ్ర రూపం దాల్చి వైసీపీ కంచుకోట బద్దలవడం ఖాయమని చెప్పారు. బీటెక్ రవి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సూపర్‌సిక్స్ హామీలను ప్రజలు విశ్వసించి అఖండ విజయం చేకూర్చారన్నారు. జగన్‌ని ఓటర్లు తిట్టిన మాటలు తాను బహిర్గతం చేస్తే ఆయన ఆత్మహత్య చేసుకుంటారన్నారు.