కోడి గుడ్డు అమర్నాథ్‌కు పెట్టుబడులంటే తెలుసా?: మోకా ఆనంద్‌సాగర్
ABN , Publish Date - Aug 03 , 2025 | 04:46 AM
మంత్రి లోకేశ్‌పై గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మోకా ఆనంద్ సాగర్ ఖండించారు.
అమరావతి, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): మంత్రి లోకేశ్‌పై గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మోకా ఆనంద్ సాగర్ ఖండించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘లోకేశ్‌కి సవాల్ విసిరే స్థాయి అమర్నాథ్‌కి లేదు. కోడి గుడ్డు మంత్రిగా ప్రజలతో పిలిపించుకున్న అమర్నాథ్ కూడా పెట్టుబడుల గురించి మాట్లాడటం విచిత్రంగా ఉంది. అసలు ఆయనకు పెట్టుబడులు అంటే ఏమిటో తెలుసా? చింత చచ్చినా పులుపు చావనట్లు వైసీపీ 11 సీట్లకు పడిపోయినా, ప్రతిపక్ష హోదా రాకపోయినా ఇప్పటికీ సిగ్గులేని కబుర్లు చెప్పుకొంటూ తిరుగుతున్నారు. ఉర్సాకు ఎకరం 99 పైసలకే కేటాయించినట్లు చెబుతున్న అమర్నాథ్ దాన్ని నిరూపించగలరా?’ అని మోకా ప్రశ్నించారు.