Share News

స్థానిక ఎన్నికల్లో టీడీపీ క్లీన స్వీప్‌ చేయాలి

ABN , Publish Date - Jul 02 , 2025 | 12:31 AM

త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ క్లీన స్వీప్‌ చేయాలని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి అన్నారు.

స్థానిక ఎన్నికల్లో టీడీపీ క్లీన స్వీప్‌ చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కోట్ల

ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియజేయండి

ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి

డోన టౌన, జూలై 1 (ఆంధ్రజ్యోతి): త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ క్లీన స్వీప్‌ చేయాలని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక టీడీపీ కార్యాలయం వద్ద నియోజకవర్గ బూత, క్లస్టర్‌ ఇనచార్జిలు, మండలస్థాయి టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అంతకు ముం దు పట్టణంలోని కొత్తపేటలో లబ్ధిదారులకు పింఛన్లు, రేషన పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే కోట్ల మాట్లాడుతూ త్వరలో జరగనున్న మున్సిపల్‌, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ విజయానికి అందరు కలిసికట్టుగా ఉండి పని చేయాలని దిశా నిర్దేశం చేశారు. నియో జకవర్గంలో 30రోజుల పాటు పండుగ వాతావరణంలో సుపరి పాల నకు తొలి అడుగు - డోర్‌ టూ డోర్‌ కార్యక్రమం నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ ప్రసాద్‌గౌడు, తహసీల్దార్‌ రవికు మార్‌, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ, ఎన్నికల కమిటీ అబ్జర్వర్స్‌ గడ్డం రామకృష్ణారెడ్డి, గోవిందనాయుడు, విజయకుమార్‌, నాయక్‌, ఓబులాపురం శేషిరెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన కోట్రికే హరికిషణ్‌, నాయకులు టీఈ కేశన్నగౌడు, చండ్రపల్లి లక్ష్మీనారాయణ యాదవ్‌, బేతంచెర్ల ఎల్లనాగయ్య, కమలాపురం సర్పంచ అర్జున రెడ్డి, కొత్తకోట శ్రీను, సుదీష్‌, తోట మనోహర్‌, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Jul 02 , 2025 | 12:32 AM