Nettem Raghuram: టీడీపీలోనే బీసీలకు ప్రాధాన్యం
ABN , Publish Date - Oct 09 , 2025 | 04:43 AM
సామాజిక, ఆర్థిక, రాజకీయంగా తెలుగుదేశం పార్టీ బీసీలకు అధిక ప్రాధాన్యమిస్తుందని టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం అన్నారు.
నగరాల కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతల స్వీకరణ సభలో కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం
విజయవాడ(వన్‌టౌన్), అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): సామాజిక, ఆర్థిక, రాజకీయంగా తెలుగుదేశం పార్టీ బీసీలకు అధిక ప్రాధాన్యమిస్తుందని టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం అన్నారు. ఆంధ్రప్రదేశ్ నగరాల సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవం బుధవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రఘురాం మాట్లాడుతూ బీసీల మద్దతుతోనే టీడీపీ ఎప్పుడూ అధికారంలోకి వస్తుందనేది చరిత్ర చెబుతున్న సత్యమన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను సీఎం చంద్రబాబు అమలు చేస్తూ, బీసీలకు పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. మరో 15 ఏళ్లు కూటమి అధికారంలోఉంటేనే సమాజాభివృద్ధి జరుగుతుందన్నారు. మరో ముఖ్య అతిథి, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రభుత్వం సాధికారత కమిటీ ఏర్పాటు చేసి కులాల వారీగా గుర్తింపు ఇవ్వడంపై హర్షం వ్యక్తమవుతోందన్నారు.