TDP Organizational Polls: సంస్థాగతంపై తుది కసరత్తు
ABN , Publish Date - Oct 18 , 2025 | 05:29 AM
టీడీపీ సంస్థాగత ఎన్నికల నిర్వహణ కొలిక్కిరానుంది. పార్టీ పదవులపై నేతలతో చర్చించేందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు శనివారం పార్టీ కార్యాలయానికి రానున్నారు.
నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు
పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుల ఖరారు
తర్వాత రాష్ట్ర కమిటీ నియామకం కూడా..!
ఏప్రిల్ నుంచి సా..గుతూనే ఉన్న ప్రక్రియ
అమరావతి, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): టీడీపీ సంస్థాగత ఎన్నికల నిర్వహణ కొలిక్కిరానుంది. పార్టీ పదవులపై నేతలతో చర్చించేందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు శనివారం పార్టీ కార్యాలయానికి రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు వచ్చి.. సుమారు 3 గంటలు అక్కడే గడుపుతారు. సాధారణంగా మేలో నిర్వహించే మహానాడు నాటికే పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను ముగిస్తుంటా రు. కానీ ఈసారి అసాధారణ జాప్యం చోటుచేసుకోవడంతో ఇంతవరకు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుల నియామకమే పూర్తికాలేదు. ఈ ప్రక్రియ పూర్తయితే తప్ప రాష్ట్ర కమిటీని ఎన్నుకోవడం సాఽ ద్యం కాదు. సంస్థాగత ఎన్నికల నిర్వహణకు టీడీపీ అధిష్ఠానం ఈ ఏడాది ఏప్రిల్లో కమిటీని నియమించింది. కమిటీ అధ్యక్షుడిగా వర్ల రామయ్య, సభ్యులుగా పల్లా శ్రీనివాసరావు, ఎండీ షరీఫ్, నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవి, సవిత, దగ్గుమళ్ల ప్రసాదరావు ఉన్నారు. ఈ కమిటీ వేసిన తర్వాత కూడా సంస్థాగత పదవుల భర్తీ వేగం పుంజుకోలే దు. క్షేత్రస్థాయిలో నాయకుల సమన్వయ లోపంతో జాప్యం జరిగింది. వైసీపీ పాలనపై పోరాడి, తప్పు డు కేసులు, వేధింపులకు గురైన వారికి జిల్లా పార్టీ పగ్గాలు, పదవులు అప్పగించాలని నాయకత్వం భా విస్తోంది. కానీ చాలా మంది ఎమ్మెల్యేలు దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల్లో పనిచేసిన వారికి కాకుండా.. ఆ తర్వాత తమ చుట్టూ తిరిగి భజన చేసే వారికి పదవులు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కారణంగా సంస్థాగత ఎన్నికల ప్రక్రియ సాగుతూ వస్తోంది. ఈ పరిణామాల ను తీవ్రంగా పరిగణించిన చంద్రబాబు.. సంస్థాగత ఎన్నికల ప్రక్రియను త్వరలో ముగించాలనే ఉద్దేశం తో శనివారం పార్టీ నేతలతో భేటీ కానున్నారు. ఈ భేటీలో పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులను ఖరారు చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత రాష్ట్ర కమిటీని కూడా నియమించనున్నారు.
అమరావతి ఇంజన్ రూం ప్రారంభం
కార్యకలాపాలపై చంద్రబాబు హర్షం
రాజధాని ప్రాంతంలో నూతన భవనంలో సీఆర్డీయే కార్యకలాపాలు ప్రారంభం కావడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ‘రాజధాని ప్రణాళిక, నిర్మాణ వ్యవహారాల పర్యవేక్షణ, అర్బన్ డెవల్‌పమెంట్ కార్యకలాపాలు అన్నీ ఒకేచోట అందుబాటులోకి రావడం ఆనందంగా ఉం ది. అమరావతి ఇంజన్ రూం ఇకపై నిరంతరాయంగా సేవలు అందిస్తుంది’ అని ఎక్స్‌లో సీఎం పోస్టు చేశారు.