రామ్మోహన్‌పై బురదచల్లడం మానాలి: టీడీపీ ఎంపీలు
ABN , Publish Date - Dec 09 , 2025 | 05:37 AM
ఇండిగో సంక్షోభాన్ని పరిష్కరించేందుకు పౌర విమానయాన మంత్రి కింజారపు రామ్మోహన్‌నాయుడు సమర్థవంతంగా పనిచేస్తున్నారని టీడీపీ ఎంపీలు పేర్కొన్నారు.
న్యూఢిల్లీ, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): ఇండిగో సంక్షోభాన్ని పరిష్కరించేందుకు పౌర విమానయాన మంత్రి కింజారపు రామ్మోహన్‌నాయుడు సమర్థవంతంగా పనిచేస్తున్నారని టీడీపీ ఎంపీలు పేర్కొన్నారు. ఏపీభవన్‌లో సోమవారం టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు సహా ఆ పార్టీ ఎంపీలు మీడియాతో మాట్లాడారు. యువకుడు అయినప్పటికీ సుదీర్ఘ అనుభమున్న మంత్రిలా రామ్మోహన్‌నాయుడు బాధ్యతలు నిర్వహిస్తున్నారని తెలిపారు. అయినా ఏపీలోని ప్రతిపక్షాలు, ఇతర పార్టీలు అదేపనిగా బురదజల్లుతున్నాయని విమర్శించారు. సంక్షోభానికి కారణమైన ఇండిగోపై చర్యలు తీసుకునేందుకు రామ్మోహన్ ఉపక్రమించారని తెలిపారు. సమావేశంలో దగ్గుమళ్ల ప్రసాదరావు, బీద మస్తాన్‌రావు, సానా సతీశ్, బీకే పార్థసారథి, అంబికా లక్ష్మీనారాయణ, మాగుంట శ్రీనివాసులురెడ్డి, బస్తిపాటి నాగరాజు, శ్రీభరత్ తదితరులు పాల్గొన్నారు.