Share News

AP TDP MPs: రక్షణ, ఏరోస్పేస్‌ పరిశ్రమల స్థాపనకు చేయూతనివ్వండి

ABN , Publish Date - Jul 26 , 2025 | 05:28 AM

ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే రక్షణ, ఏరోస్పేస్‌ పరికరాల తయారీ రంగంలో అగ్రగామిగా నిలిపేందుకు సహకరించాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు టీడీపీ ఎంపీల బృందం విజ్ఞప్తి చేసింది.

AP TDP MPs: రక్షణ, ఏరోస్పేస్‌ పరిశ్రమల స్థాపనకు చేయూతనివ్వండి

  • కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు టీడీపీ ఎంపీల విజ్ఞప్తి

న్యూఢిల్లీ, జూలై 25(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే రక్షణ, ఏరోస్పేస్‌ పరికరాల తయారీ రంగంలో అగ్రగామిగా నిలిపేందుకు సహకరించాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు టీడీపీ ఎంపీల బృందం విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలో రక్షణ, అంతరిక్ష పరిశ్రమల మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించి కీలక ప్రతిపాదనలపై వినతిపత్రం అందించేందుకు శుక్రవారం రాజ్‌నాథ్‌సింగ్‌తో ఎంపీల బృందం భేటీ అయింది. ఆ బృందంలో టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎంపీలు దగ్గుమళ్ల ప్రసాదరావు, మాగుంట శ్రీనివాసులురెడ్డి ఉన్నారు.

Updated Date - Jul 26 , 2025 | 05:29 AM