AP TDP MPs: రాధాకృష్ణన్ నామినేషన్‌పై టీడీపీ ఎంపీల సంతకాలు
ABN , Publish Date - Aug 20 , 2025 | 06:46 AM
ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీపీ రాధాకృష్ణన్‌ను టీడీపీ ఎంపీలు అభినందించారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీపీ రాధాకృష్ణన్‌ను టీడీపీ ఎంపీలు అభినందించారు. మంగళవారం జరిగిన ఎన్డీఏ ఎంపీల భేటీలో ఆయన్ను సత్కరించారు. అనంతరం ఆయన నామినేషన్ పత్రాలపై కేంద్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు, కలిశెట్టి అప్పలనాయుడు, తెన్నేటి కృష్ణప్రసాద్ సంతకాలు చేశారు.
ఎన్డీఏ అభ్యర్థికే మా మద్దతు: వైవీ సుబ్బారెడ్డి: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్‌కే తాము మద్దతిస్తామని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మూడ్రోజుల క్రితమే తమ పార్టీ అధినేత జగన్‌కు ఫోన్ చేసి మద్దతు కోరారని.. జగన్ ఆ మేరకు హామీ ఇచ్చారని తెలిపారు. ఒకసారి హామీ ఇచ్చిన తర్వాత తమ వైఖరి మార్చుకోబోమని స్పష్టంచేశారు.