AP TDP MPs: ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌కు అనుమతులు మంజూరు చేయండి
ABN , Publish Date - Aug 08 , 2025 | 06:07 AM
ఆంధ్రప్రదేశ్‌లో ఆర్సెలార్-మిట్టల్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించిన అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని కేంద్రమంత్రి కె.రామ్మోహన్ నాయుడు...
కేంద్ర ఉక్కు మంత్రికి టీడీపీ ఎంపీల వినతి
న్యూఢిల్లీ, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో ఆర్సెలార్-మిట్టల్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించిన అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని కేంద్రమంత్రి కె.రామ్మోహన్ నాయుడు, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు, పార్టీ ఎంపీలు కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామిని కోరారు. ఈ మేరకు గురువారం ఆయనకు వినతిపత్రం అందజేశారు. ఎన్‌ఎండీసీ నుంచి ఇనుప ఖనిజం కేటాయింపు, స్లరీ పైప్‌లైన్‌కు సంబంధించిన అనుమతులను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్లాంట్ పారిశ్రామికాభివృద్ధితో పాటు భారీఎత్తున ఉపాధి కల్పిస్తుందని, విశాఖ-చెన్నై కారిడార్‌కు ప్రధాన కేంద్రంగా మారుతుందని పేర్కొన్నారు.