MP Tenneti Krishna Prasad: ఏపీలో అణుశక్తి సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేయండి
ABN , Publish Date - Dec 18 , 2025 | 04:36 AM
అణుశక్తితోనే వికసిత్ భారత్ సాధ్యమని టీడీపీ ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ పేర్కొన్నారు.
లోక్‌సభలో టీడీపీ ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ విజ్ఞప్తి
న్యూఢిల్లీ, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): అణుశక్తితోనే వికసిత్ భారత్ సాధ్యమని టీడీపీ ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం లోక్‌సభలో శాంతి బిల్లు-2025పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ దేశాభివృద్ధిలో అణుశక్తి కీలక పాత్ర పోషించనుందన్నారు. అమెరికా, ఫ్రాన్స్, జపాన్ తదితర దేశాలు తమ విద్యుత్ అవసరాల్లో 50శాతానికిపైగా అణుశక్తి ద్వారా పొందుతుంటే భారత్ మాత్రం 3శాతానికే పరిమితమైందని తెలిపారు. 2047 నాటికి భారత్‌లో 100 గిగావాట్ల అణు విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకోవడం హర్షణీయమన్నారు. ఐటీ రంగంలో తెలుగు యువత ప్రపంచాన్ని ఏలుతున్నట్లుగానే అణుఇంధన రంగంలోనూ రాణించేలా నైపుణ్య శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఏపీలో అణుశక్తి పరిశోధన, నైపుణ్య అభివృద్ధి కోసం ‘సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’ను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరారు.