Share News

Anantapur: జూనియర్‌పై టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యల దుమారం

ABN , Publish Date - Aug 18 , 2025 | 04:49 AM

సినీ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌పై అనంతపురం అర్బన్‌ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ వ్యాఖ్యల ఆడియో దుమారం రేపింది. జూనియర్‌ ఎన్టీఆర్‌ను దూషించినట్లుగా...

Anantapur: జూనియర్‌పై టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యల దుమారం

  • కార్యకర్తతో సంభాషిస్తూ విమర్శలు.. ఆడియో వైరల్‌

  • అది నాది కాదు: అనంత ఎమ్మెల్యే దగ్గుపాటి

అనంతపురం క్రైం, ఆగస్టు17(ఆంధ్రజ్యోతి): సినీ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌పై అనంతపురం అర్బన్‌ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ వ్యాఖ్యల ఆడియో దుమారం రేపింది. జూనియర్‌ ఎన్టీఆర్‌ను దూషించినట్లుగా ఉన్న ఆడియోపై ఫ్యాన్స్‌ ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే ఫ్లెక్సీలు చించి, క్యాంపు కార్యాలయం వద్ద ఆదివారం ధర్నా చేపట్టారు. వీరిని అడ్డుకునే ప్రయత్నం చేసిన టీడీపీ నేతలతో వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు.

రాజకీయ కుట్ర: దగ్గుపాటి

ఆడియో వైరలైన కాసేపటికే ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. వివాదాస్పద ఆడియోతో తనకు సంబంధం లేదన్నారు. ఇదంతా రాజకీయ కుట్రలో భాగమన్నారు. దీనిపై ఎస్పీకి ఫిర్యాదు చేశాననీ, గట్టి చర్యలు తీసుకోవాలని కోరానన్నారు. తన పేరు ప్రస్తావించారు కాబట్టి ఎన్టీఆర్‌కు క్షమాపణలు చెబుతున్నానన్నారు.


ఆడియో సంభాషణ ఇదీ..

ఎమ్మెల్యే: ఏ థియేటరప్పా..?

టీఎన్‌ఎస్ఎఫ్ నేత: అన్నా.. త్రివేణి. అన్ని థియేటర్లు షో పెట్టారు.

ఎమ్మెల్యే: మనోళ్లు మాట్లాడారా... రామూ, వీళ్లంతా ఓకే చేశారా..?

టీఎన్‌ఎస్ఎఫ్ నేత: ఏం లేదు అన్నా.. వాళ్లే మాట్లాడుకున్నారన్నా. శాంతి థియేటర్‌ ఇవ్వలేదు. గలాటా జరిగింది. వాళ్లు వేయం అన్నారు.

ఎమ్మెల్యే: ఏవేవి ఇచ్చారు..?

టీఎన్‌ఎస్ఎఫ్ నేత: త్రివేణి, గౌరి కాంప్లెక్స్‌ అన్నా.

ఎమ్మెల్యే: పర్మిషన్లు ఉన్నాయా..?

టీఎన్‌ఎస్ఎఫ్ నేత: అన్నా... గవర్నమెంటే ఇచ్చింది.

ఎమ్మెల్యే: పర్మిషన్లు లేవు, ఆపేయిస్తున్నా.

టీఎన్‌ఎస్ఎఫ్ నేత: ఎందుకులే.. అన్నా మనకు..

ఎమ్మెల్యే: వానెమ్మ...(బూతు) జూనియర్‌ గాడు..(బూతు) ఆపేయిస్తున్నా..

టీఎన్‌ఎస్ఎఫ్ నేత: ఎందుకన్నా మనకు..

ఎమ్మెల్యే: ఆహా.. నాకు అవసరమే కదా. లోకేశ్‌తో ఎలా పెట్టుకుంటాడు... ల... కొడుకు?

టీఎన్‌ఎస్ఎఫ్ నేత:మనమైతే ఆ విషయంలో ఆపోజిట్‌..

ఎమ్మెల్యే: ఎట్లా ఏపిస్తావు గాడిదా... నువ్వు..?

టీఎన్‌ఎస్ఎఫ్ నేత: నేనెవరు అన్నా వేయించడానికి. స్టేట్‌ వైడ్‌ సినిమా వేయిస్తున్నారు.

ఎమ్మెల్యే: సరే వేయించుకో. పర్మిషన్‌ లేదుగా..? ఎట్లా వేయిస్తావు?

టీఎన్‌ఎస్ఎఫ్ నేత: నేనెవరన్నా...

ఎమ్మెల్యే: సినిమా ఆడదు.. ఓకేనా?

టీఎన్‌ఎస్ఎఫ్ నేత: మనదేం పోతుందన్నా...?

ఎమ్మెల్యే: లోకేశ్‌ సార్‌ గురించి మాట్లాడతారా..? నాకు తెలియకుండా ఎలా ఆడుతుంది. నేను ఎమ్మెల్యే. సినిమా ఆడదు అని చెప్పు.. గాడ్‌ ప్రామిస్‌. నిలిపేపిస్తున్నా. అందర్నీ పంపించేయండి.

Updated Date - Aug 18 , 2025 | 04:51 AM