Share News

Ministers Achenna: వైసీపీ నాటకాలను ప్రజలు గమనించాలి

ABN , Publish Date - Dec 16 , 2025 | 03:36 AM

అసెంబ్లీకి రాకుండా పులివెందుల ఎమ్మెల్యేగా చరిత్రలో మిగిలిపోతున్న జగన్‌ పార్టీకి ప్రజా ఉద్యమాలు చేసే అర్హ త లేదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు....

Ministers Achenna: వైసీపీ నాటకాలను ప్రజలు గమనించాలి

  • పేద, మధ్యతరగతికి వైద్య కళాశాలల్లో 850 సీట్లు: అచ్చెన్న

అమరావతి, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): అసెంబ్లీకి రాకుండా పులివెందుల ఎమ్మెల్యేగా చరిత్రలో మిగిలిపోతున్న జగన్‌ పార్టీకి ప్రజా ఉద్యమాలు చేసే అర్హ త లేదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం మంత్రి ఓ ప్రకటన చే స్తూ వైసీపీ పాలనలో మెడికల్‌ కాలేజీలకు కేంద్రం ఇచ్చిన రూ.1,550 కోట్లే ఖర్చు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూపాయి ఖర్చు చేయలేదు. జగన్‌ కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంలో మెడికల్‌ కాలేజీలు నిర్మిస్తామంటే... అడ్డుపడుతున్నారు. వైసీపీ నాటకాలను ప్రజలు గమనించి, తిరస్కరించాలి. పీపీపీ విధానంలో మెడికల్‌ కాలేజీల నిర్మాణం రెండేళ్లలో పూర్తవుతాయి. పీపీపీ విధానంలో మెడికల్‌ సీట్లు 500 నుంచి 2 వేల దాకా పెరుగుతాయి. పేద, మధ్య తరగతి విద్యార్థులకు 850 సీట్లు కేటాయింపు ఉంటుంది.’ అని అచ్చెన్న పేర్కొన్నారు. కాగా, చంద్రబాబు విజన్‌ కలిగిన నాయకుడైతే జగన్‌ విధ్వంసానికి మారుపేరని ఎమ్మెల్యే నసీర్‌ అహ్మద్‌ పేర్కొన్నారు. ఇక, కూటమి పాలనలో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయనడానికి ఆర్బీఐ నివేదికే నిదర్శనమని మాజీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్‌బాబు అన్నారు. ‘కూటమి ప్రభుత్వ చర్యలతో పండ్లు, ఆక్వా ఉత్పత్తుల్లో దేశంలోనే ఏపీ నంబర్‌ వన్‌గా నిలిచింది. జగన్‌ హయాంలో నిరుద్యోగం దాదాపు 7 శాతానికి పెరిగింది. కూటమి ప్రభుత్వం దాన్ని గణనీయంగా తగ్గించగలిగింది’ అని అశోక్‌ విమర్శించారు.

వైసీపీ హయాంలో ఆర్థిక విధ్వంసం: యనమల

‘వైసీపీ హయాంలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగింది. దీనిపై జగన్‌ బహిరంగ చర్చకు రాగలడా?’ అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. వైసీపీ హయాంలో జరిగిన ఆర్థిక విధ్వంసం వల్ల రాష్ట్ర ఆదాయం పడిపోయి వృద్ధి రేటు కుంటుపడిందన్నారు. రూ.10 లక్షల కోట్లకుపైగా జగన్‌ అప్పులు చేశారన్నారు.

పీపీపీ విధానానికి కేంద్రమూ గ్రీన్‌ సిగ్నల్‌!: నీలాయపాలెం

‘దేశంలో ఎంబీబీఎస్‌ చదవాలనుకునే ప్రతి 10 లక్షల మందికి కేవలం 75 సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ సంఖ్యను గణనీయంగా పెంచాలన్న ఆలోచనతో ఇకపై పీపీపీ విధానంలోనే మెడికల్‌ కాలేజీలు ప్రారంభించాలంటూ పార్లమెంటు స్టాండింగ్‌ కమిటీ సిఫారసు చేసింది. కేంద్రం దీనిని ఆమోదించింది’ అని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్‌ నీలాయపాలెం విజయకుమార్‌ పేర్కొన్నారు. ఈ విధానంపై అవగాహన లేమితో జగన్‌... కోటి సంతకాలంటూ నాటకాలు ఆడుతున్నారని అని నీలాయపాలెం ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - Dec 16 , 2025 | 03:36 AM