Macharla: టీడీపీ నేతల జంట హత్య కేసు.. మరోసారి విచారణకు పిన్నెల్లి సోదరులు
ABN , Publish Date - Oct 11 , 2025 | 04:55 AM
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రా మకృష్ణారెడ్డి(ఏ6), ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి (ఏ7) శుక్రవారం పోలీసు ల విచారణకు హాజరయ్యా రు.
మాచర్ల, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(ఏ6), ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి (ఏ7) శుక్రవారం పోలీసుల విచారణకు హాజరయ్యా రు. పల్నాడు జిల్లా మాచ ర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గుండ్లపాడు టీడీపీ నేతలు జవిశెట్టి సోదరులు వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు హత్య కేసులో వీరిద్దరూ నిందితులు. గతంలో విచారణకు హాజరైన వీరు మరోసారి విచారణ కు మాచర్ల సర్కిల్ కార్యాలయానికి హాజరయ్యారు. గురజాల డీఎస్పీ జగదీశ్ పర్యవేక్షణలో మాచర్ల రూరల్ సీఐ నఫీజ్ బాషా విచారించారు. ఈ కేసులో తాత్కాలిక బెయిలుపై ఉన్న పిన్నెల్లి సోదరులు 2 వారాల క్రితం విచారణకు హాజరయ్యారు. ఆ సందర్భంగా తెలీదు, గుర్తు లేదు, సంబంధం లేదు అంటూ సమాధానాలు చెప్పారు. శుక్రవారం రెండోసారి విచారణలో కూడా అవే సమాధానాలు చెప్పారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, వెంకట్రామిరెడ్డిని మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6:30 వరకు విచారించారు. ఇరువురుకీ సుమారు 70 నుంచి 80 ప్రశ్నలు సంధించారు. మరోసారి విచారణకు రావాలని పోలీసులు తెలిపారు.